ఇంటి పైకప్పుపై డబ్బు సంచులు
close

తాజా వార్తలు

Published : 14/11/2020 16:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటి పైకప్పుపై డబ్బు సంచులు

 

మేరఠ్‌ : ఓ వ్యక్తి ఉదయం నిద్రలేవగానే తన ఇంటిపైకప్పుపై రెండు సంచులు ఉన్నట్లు గుర్తించాడు. వాటిల్లో పెద్ద మొత్తంలో నగదు ఉండటంతో ఆశ్చర్యపోయి అతను పోలీసులకు సమాచారం అందించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  ఆ రాష్ర్టంలోని మేరఠ్‌లో నివాసం ఉండే పవన్‌ సింఘాల్‌ అనే వ్యాపారి ఇంట్లో నేపాల్‌కు చెందిన రాజు అనే వ్యక్తి పని చేసేవాడు. ఇతను రెండేళ్ల కిందట అక్కడి నుంచి వెళ్లిపోయి ఇటీవల తిరిగొచ్చాడు. ఆ సమయంలో ఇంటి యజమాని లేకపోవడంతో సెక్యురిటీగార్డుతో కలిసి దొంగతనానికి పాల్పడ్డాడు. దాదాపు రూ. 40  లక్షల నగదు ఉన్న రెండు సంచులతో వెళ్తే సీసీ కెమెరాల్లో నమోదై దొరుకుతాననే ఆలోచనతో వాటిని ఆ ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిపై విసిరేశాడు. తర్వాత వచ్చి సంచులను తీసుకుందామని వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. 

ఈ క్రమంలో మరుసటి రోజు బుధవారం ఉదయం ఆ పక్కింట్లో ఉండే వరుణ్‌శర్మ తన ఇంటిపై ఉన్న సంచుల్లో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. ఎవరో డబ్బును దొంగిలించి ఇక్కడ పెట్టి ఉంటారని ఆ వ్యక్తి భావించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో నగదు ఉన్న సంచులను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ నగదు లభించిన ఇంటి పక్కన ఉండే వ్యాపారి ఇంట్లో అంతకుముందు రోజు రాత్రి దొంగతనం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి దొంగతనం చేయడానికి రాజుకు సహకరించిన సెక్యురిటీ గార్డును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని