close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 11/06/2020 08:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంటి యజమాని రావద్దన్నాడు...ఆసుపత్రి వారు పంపేశారు...

రోడ్డున పడ్డ జీవితాలకు జోరువానతో నరక యాతన

బరువెక్కిన గుండెలకు గూడైన మెట్రో పిల్లర్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కుటుంబ సభ్యుడొకరికి కరోనా వైరస్‌ సోకి గాంధీ ఆసుపత్రిలో ఉన్నారు. తమకూ వైరస్‌ సోకిందేమోననే అనుమానంతో ఆసుపత్రికి వెళ్తే బెడ్లు లేవన్నారు. ఇంటి యజమానికి ఫోన్‌ చేసి విషయం చెబితే ఇంట్లోకి రావొద్దన్నాడు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో చాలాచోట్ల అద్దె ఇంట్లో ఉండేవారు పడే ఇబ్బందులకు ఈ ఘటన ఓ నిలువుటద్దం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చిన తల్లి, ఆమె ముగ్గురు కుమారులు మూసాపేటలో అద్దెకు ఉంటున్నారు. అంతా కాయకష్టం చేసేవారే. అన్నదమ్ముల్లో చివరి వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగతా ముగ్గురూ బుధవారం మధ్యాహ్నం ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రికి పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లారు. అక్కడి సిబ్బంది ‘పడకలు ఖాళీగా లేవు.. గురువారం రండి’ అని చెప్పి పంపించారు. అప్పుడు వారు ఇంటి యజమానికి ఫోన్‌ చేశారు. ‘‘మీరు ఇంటికి వస్తే.. అద్దెకున్న ఇతర కుటుంబాల వారు ఆందోళనకు గురవుతారు. కాబట్టి దయచేసి ఇంటికి రాకండి’’ అని యజమాని నుంచి బదులొచ్చింది. వారికేమీ పాలుపోలేదు. చాలాసేపు రోడ్డుపైనే గడిపారు. అంతలో జోరు వాన మొదలైంది. వారి కన్నీరు.. వాన నీటిలో కలిసిపోయి... వేదనతో ఆ మూడు హృదయాలు కల్లోల కడలినే తలపించాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి 9 వరకు ఈఎస్‌ఐ ఆసుపత్రి సమీపంలోని మెట్రో పిల్లరును ఆసరాగా చేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. దూరపు బంధువు ఒకరు చేరదీసి ఇంట్లో తలదాచుకోవడానికి అవకాశం ఇవ్వడంతో వారికి కాస్త ఊరట దక్కింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.