తెగులు సోకిందని పంటకు నిప్పు
close

తాజా వార్తలు

Published : 23/10/2020 22:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెగులు సోకిందని పంటకు నిప్పు

ఇంటర్నెట్‌ డెస్క్‌ : తెగులు సోకిందన్న కారణంతో ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంటకు నిప్పు పెట్టాడు ఓ రైతు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దేవరాజు అనే రైతు తన రెండెకరాల పొలంలో సోనా సాగుచేశాడు. ఇటీవల పంటకు తెగులు సోకింది. దాంతో పలుమార్లు అధికారులను సంప్రదించాడు. వారు సకాలంలో స్పందించలేదు. పంటకు ఎలాంటి మందులు పిచికారీ చేయాలో అతడికి పాలుపోలేదు. ఏం చేయాలో అర్థం కాని అతడు పంటకు నిప్పు పెట్టాడు. వ్యవసాయ పొలంలో నిరసనకు దిగాడు. ఏటా దొడ్డు రకం సాగు చేసేవాడినని, ప్రభుత్వ సూచనతో కొత్తగా వేసిన పంటతో పూర్తిగా నష్టపోయానని వివరించాడు. పంట సాగుకు రూ.80 వేలకు పైగా ఖర్చు వచ్చిందని తెలిపాడు. తనకు చిన్నచిన్న పిల్లలు ఉన్నారని పేర్కొన్నాడు. ఇదే రీతిలో కామారెడ్డి జిల్లా లింగాపూర్ లోనూ ఇద్దరు రైతులు పంటను దహనం చేశారు. ప్రభుత్వం సూచించినట్లుగా దొడ్డురకం కాదని సన్నాలు సాగుచేసినా.. చీడపీడలతో పంట దెబ్బతిందని ఆందోళన చెందారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని