close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 08/03/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రతి మహిళా..ఓ ఆర్థిక మంత్రే!

భారతీయ మహిళలు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. దేశీయ, బహుళజాతి సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో తమ సత్తా చాటుతున్నారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.. రంగం ఏదైనా వారికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.. కానీ, ఇప్పటికీ ఎంతోమంది మహిళలు ఆర్థిక స్వేచ్ఛ విషయంలో కొంత వెనకబడి ఉన్నారని చెప్పాల్సి రావడం నిజంగా విచారకరమే. పురుషులతో పోలిస్తే మహిళల ఆర్థిక నిర్వహణే నిక్కచ్చిగా ఉంటుందని అంటారు. పొదుపును వారికి ప్రత్యేకంగా నేర్పక్కర్లేదు. అయినప్పటికీ.. పరిస్థితుల ప్రభావం వారికి ఆర్థిక స్వేచ్ఛను దూరం చేస్తోంది. ఆ అడ్డంకులను దాటుకొని, ఆర్థిక నిర్వహణ తమ చేతిలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.. దానికోసం ఏం చేయాలి? తెలుసుకుందాం...
ఆర్థిక స్వేచ్ఛ అంటే.. కేవలం సంపాదించడం ఒక్కటే కాదు.. దాన్ని ఎలా నిర్వహించాలనేదీ మీ ఇష్టానుసారం జరగాలి. ఎంతోమంది మహిళలు ఆర్థిక నిర్వహణ తమ పనికాదనుకుంటారు. ఒకవేళ అన్ని విషయాల్లోనూ తాము జోక్యం చేసుకుంటే కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయని భావిస్తుంటారు. ఉద్యోగ, వ్యాపార నిర్వహణలో ఎన్నో కష్టనష్టాలు ఉంటాయి. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. ఇవన్నీ సులభంగా చేయగలిగినప్పుడు.. డబ్బు గురించి తెలుసుకోవడం మీకు పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం ఆర్థిక అంశాలకు సంబంధించిన సమాచారం విస్తృతంగా లభిస్తోంది. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామితో ఆర్థిక విషయాలను చర్చించండి. వీలైతే వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించండి. మీకున్న అనుమానాలన్నీ అక్కడ నివృత్తి చేసుకోండి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు కావాల్సిన అవగాహన పెంచుకోవడం కోసం ప్రయత్నించండి.
అత్యవసర నిధి ఉంచుకోండి..
ఆర్జించే వ్యక్తి ఎవరైనా సరే.. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడే మొత్తాన్ని అందుబాటులో ఉంచుకోవడం తప్పనిసరి. క్రమం తప్పకుండా వచ్చిన ఆదాయం ఏదైనా అవాంతరం వచ్చి ఆగిపోయినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అనుకోకుండా ఉద్యోగం కోల్పోయినా, ప్రమాదం, తీవ్రంగా జబ్బు పడటంలాంటి సందర్భాల్లో ఇది అవసరం అవుతుంది. కనీసం 6 నెలల ఖర్చులకు మన దగ్గర డబ్బు ఉంటే.. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండేందుకు వీలవుతుంది. దంపతులిద్దరూ కలిసి వేర్వేరుగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఉమ్మడి ఖాతాలోనైనా జమ చేసుకోవాలి. ఈ నిధిని అత్యధిక వడ్డీ వచ్చే పొదుపు ఖాతాలోనైనా, లేదా షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్లలోనైనా జమ చేయాలి.


ప్రణాళికతో అడుగులు..
జీవితంలో మనకున్న ఆర్థిక లక్ష్యాలేమిటి అనేది ముందు గుర్తించాలి. దీనికోసం కచ్చితమైన ప్రణాళిక వేసుకోవాలి. మనం అనుకుంటున్న లక్ష్యం ఏమిటి? దాన్ని సాధించేందుకు ఎన్నేళ్లు పడుతుంది? ఎంత మొత్తం అవసరం? ఇప్పుడు ఎంత పెట్టుబడి
పెట్టగలం? ఇలాంటి ఎన్నో విషయాలను ఒక చోట రాసిపెట్టుకుంటేనే మేలు. మీరు నష్టభయం ఎంత మేరకు భరించగలరు అనేదాని ఆధారంగా పెట్టుబడులను ఎంచుకోవాలి. ప్రతి పెట్టుబడికి ఒక లక్ష్యం ఉండాలన్న విషయం మర్చిపోవద్దు. సొంతంగా వాహనం కొనడం, ఇల్లు కొనుగోలు, లేదా విహార యాత్ర, పదవీ విరమణ ప్రణాళిక ఏదైనా సరే..ఆయా అవసరాలకు అనుగుణంగా అనువైన పథకాలను ఎంచుకొని, మదుపు చేయాలి.

- రాధికా బినానీ, చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌, www.paisabazar.com


పదవీ విరమణ తర్వాత..
పురుషులు, మహిళల మధ్య గతంలో వేతన వ్యత్యాసం కనిపించేది. ఇది ఇప్పుడు అంతగా లేకున్నా.. పూర్తిగా పోయిందని మాత్రం చెప్పలేం. పొదుపు విషయంలో మహిళలు శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోంది. కుటుంబ బాధ్యతలు, పెళ్లి, పిల్లలు.. తదితర కారణాలతో కొన్నిసార్లు తమ ఉద్యోగానికి కొంతకాలం దూరం అవ్వాల్సి రావచ్చు. తర్వాత తిరిగి విధుల్లో చేరినా.. వేతనం విషయంలో రాజీపడాల్సి వస్తుంది. ఇవన్నీ దీర్ఘకాలిక ఆదాయ వృద్ధిపై ప్రభావం చూపిస్తాయి. పెట్టుబడులు పెట్టకపోవడంతో చక్రవడ్డీ ప్రయోజనాలూ కోల్పోతారు.
మహిళలు తమ సంపాదన ప్రారంభం కాగానే అధిక మొత్తంలో పొదుపు, మదుపులకు కేటాయించాలి. దీన్ని పదవీ విరమణ అవసరాలకు వాడుకునేందుకు వీలుగా దీర్ఘకాలిక పథకాల్లో జమ చేయాలి. యూనిట్‌ ఆధారిత బీమా పాలసీల్లాంటివి ఇందుకు ఉపయోగపడతాయి. కుటుంబానికి ఆధారమైన మహిళలు తప్పనిసరిగా తమ పేరుమీద టర్మ్‌ పాలసీ ఉండేలా చూసుకోవాలి. నెలవారీ కొంత మొత్తం పెట్టుబడి పెట్టేందుకు క్రమానుగత పెట్టుబడి విధానంలో మీకు నప్పే పథకంలో జమ చేయండి. చూస్తుండగానే పెద్ద నిధిగా మారి, మీకు అన్ని వేళలా ఎంతో భరోసానిస్తుంది.

- తరుణ్‌ చుఘ్‌, ఎండీ-సీఈఓ, బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.


ఆరోగ్య ధీమా...
మహిళల ఆరోగ్య అవసరాలు పురుషులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. దురదృష్టవశాత్తూ చాలామంది స్త్రీలు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ఒక నివేదిక ప్రకారం.. 79% మంది మహిళలు ఒత్తిడితో బాధపడుతున్నారు. ఇది తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆర్థరైటీస్‌, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బుల్లాంటి వాటి బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు బీమా సంస్థలూ మహిళల ప్రత్యేక అవసరాలను గుర్తిస్తున్నాయి. అందుకు అనుగుణంగా పాలసీలు తెస్తున్నాయి. అనారోగ్యం బారిన పడాలని ఎవరూ కోరుకోరు. కానీ, అనుకోకుండా ఆసుపత్రిపాలైతే.. ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరం. ఈ మహిళా దినోత్సవం రోజున మీరు తీసుకునే తొలి నిర్ణయం ఇదే కావాలి.
- సప్నా దేశాయ్‌, సీఎంఓ, మణిపాల్‌సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌.


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.