close

తాజా వార్తలు

ఇక వాట్సప్‌కీ వేలిముద్ర తాళం

వాషింగ్టన్‌: ఫోన్‌కి వేలిముద్ర తాళం (ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌) వేసుకున్నట్టే... ఇక నుంచి వాట్సప్‌కీ వేసుకోవచ్చు. ఐఫోన్‌ వినియోగదారుల ఛాటింగ్‌ గోప్యత, భద్రత నిమిత్తం గతంలోనే టచ్‌ఐడీ, ఫేస్‌ఐడీ సదుపాయాలను ఈ యాప్‌ తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో పనిచేసే ఫోన్లను వినియోగించేవారి కోసం ఈ సదుపాయాన్ని తెచ్చింది.

* ఇప్పటికే మీరు వాట్సప్‌ను వాడుతున్నట్టయితే... ఈ కొత్త సదుపాయం కోసం ముందుగా దాన్ని అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కొత్త వాట్సప్‌ వెర్షన్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
* యాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్తే... ‘ప్రైవసీ’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో ‘ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌’ను ఎంపిక చేసుకోవాలి.
* తర్వాత మీరు వేలిముద్రను స్కాన్‌ చేసుకోవాలి. అప్పట్నుంచి వేలిముద్రతో వాట్సప్‌ను తెరిచి, చాట్‌ చేయవచ్చు.
యాప్‌ను ఒకసారి తెరిచిన తర్వాత మళ్లీ ఎంతసేపటికి ఆటోమేటిక్‌గా లాక్‌ పడిపోవాలన్నది మీరు నిర్ణయించుకోవచ్చు. ఇందుకు... ఇమీడియేట్‌, ఆఫ్టర్‌ 1 మినిట్‌, ఆఫ్టర్‌ 30 మినిట్స్‌ అనే సదుపాయాలను వాట్సప్‌ అందించింది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.