close

తాజా వార్తలు

Published : 08/02/2020 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

21 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం

ముంబయి: నవీ ముంబయిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టర్‌ 44, నెరుల్‌ సీవుడ్స్‌ ప్రాంతంలోని ఓ 21 అంతస్తుల భవనంలో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. నాలుగు గంటలపాటు శ్రమించి మంటల్ని ఆర్పారు. ఈ ప్రమాదంలో సామాన్య పౌరులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే మంటలార్పే క్రమంలో సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. తొలుత 20వ అంతస్తులో చెలరేగిన మంటలు క్రమంగా పై అంతస్తుకు విస్తరించినట్లు స్థానికులు తెలిపారు. నివాసితులంతా బయటకు పరుగులు పెట్టడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని