close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120016781 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1223954117824937984 [video_short_link] => 1223954117824937984 [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-02-04 17:07:37.645932 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 04/02/2020 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మండుతున్న నది... వీడియో వైరల్

దిల్లీ: నదిలోని నీటిపై భయంకరంగా మంటలు చెలరేగుతున్న వీడియో ఒకటి ట్విటర్‌లో చక్కర్లు కొడుతోంది. నదినీటిపై ఎర్రని మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో పాటు దట్టమైన నల్లని పొగ చూసేవారిని భయాందోళనలకు గురిచేస్తోంది. బ్రహ్మపుత్ర నదికి ఉన్న ఉపనదులలో ఒకదానిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పైప్‌లైన్లలో లీకేజీయే ఈ మంటలకు కారణమని తెలిసింది. పర్యావరణ ప్రేమికులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
‘‘నదిలో మంటలు...  అసోంలో నహర్‌కటియాలోని బుర్హి డిహింగ్ నదికి మంటలు అంటుకున్నాయి. ఆయిల్‌ పైప్‌లో సంభవించిన విస్ఫోటనం కారణంగా మొదలైన ఈ మంట మూడు రోజుల నుంచి మండుతోంది. దీనిని ఎవరూ పట్టించుకోవటం లేదు.’’ అని చెబుతూ ఒకరు దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. కాగా ఈ సంఘటనను గురించి ఇంటర్‌నెట్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పర్యావరణానికి విఘాతమని, మంటలను ఆర్పటానికి వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 

‘‘నది సమీపంలో ఉన్న ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన పైప్‌లైన్‌లో చోటుచేసుకున్న సమస్య వల్ల ముడి చమురు బయటకు వ్యాప్తించింది. అది నీటి మీద తేలుతుండగా ఎవరో దానికి నిప్పంటించారు. అనంతరం ఆ మంటలు వాటంతట అవే అగిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. పరిస్థితి అదుపులోనే ఉంది...’’ అని ఒక అధికారి వివరించారు. ఈ ఘటనపై లోతుగా విచారణ జరపటానికి ఒక కమిటీని వేసినట్టు కూడా ఆయన తెలిపారు. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.