ఆ రికార్డు సాధించిన తొలి దక్షిణాది పాట
close

తాజా వార్తలు

Published : 16/08/2020 16:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రికార్డు సాధించిన తొలి దక్షిణాది పాట

హైదరాబాద్‌: ‘నీలి నీలి ఆకాశం.. ఇద్దామనుకున్నా’ అంటూ ప్రదీప్‌, అమృత అయ్యర్‌లు యువ హృదయాలను కొల్లగొట్టేశారు. వారిద్దరూ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’. మున్నా దర్శకుడు. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. అయితే, అంతకు ముందే అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు విడుదల చేసిన ‘నీలి నీలి ఆకాశం..’ పాట మాత్రం యూట్యూబ్‌ వేదికగా దూసుకుపోతోంది.

తాజాగా ఈ పాట 200 మిలియన్‌ వ్యూస్‌(అన్ని ఫ్లాట్‌ఫాంలు కలిపి)తో దక్షిణాదిలో మరే పాట సాధించని రికార్డును సృష్టించింది. ఈ పాటకు అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. సిధ్‌ శ్రీరామ్‌, సునీత ఆలపించారు. ఎస్వీపీ పిక్సర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ గాయకులకు, సంగీత సహకారం అందించిన సాంకేతిక బృందానికి మ్యూజిక్‌ లవర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని