వాట్సాప్‌లో ఈ ట్రిక్స్‌ గురించి తెలుసా..?

తాజా వార్తలు

Published : 17/11/2020 14:30 IST

వాట్సాప్‌లో ఈ ట్రిక్స్‌ గురించి తెలుసా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అత్యంత చేరువైన యాప్‌ వాట్సాప్‌. మెసేజింగ్ నుంచి పేమెంట్స్‌..వ్యాపారం నుంచి షాపింగ్‌ వరకు ఇలా ఎన్నో రకాల ఫీచర్స్‌తో సేవలందిస్తుంది. అయితే ఈ యాప్‌లోని చాలా ఫీచర్స్‌ మనకి పరిచయం ఉన్నప్పటికీ తెలియనివి కూడా ఉన్నాయి. అందుకే రోజువారీ జీవితంలో మనకి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన ఫీచర్స్‌ మీ కోసం..అవేంటో ఒక్కసారి చూద్దాం.


ముఖ్యమైన వాటికే స్టార్‌ స్టేటస్..

వాట్సాప్‌ ఓపెన్‌ చేస్తే చాలు రోజుకి ఎన్నో మెసేజ్‌లు వస్తుంటాయి. ఆఫీస్‌, స్నేహితులు, బంధువులు ఇలా వేర్వేరు గ్రూపుల నుంచే కాకుండా వ్యక్తిగతంగా వచ్చే మెసేజ్‌లు ఉంటాయి. అయితే వీటిలో ముఖ్యమైన మెసేజ్‌లను తిరిగి చూసుకోవాలంటే ఛాట్ హిస్టరీని పైకి జరుపుకుంటూ వెళ్లాలి. ఒక్కోసారి ఎంత వెతికినా అవి కనిపించవు. దీని వల్ల సమయం కూడా వృధా అవుతుంది. ఈ సమస్య పరిష్కారంగా వాట్సాప్‌ స్టార్‌ మెసేజ్‌ ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఇందులో మీకు కావాల్సిన మెసేజ్‌పై కొన్ని సెకన్లు క్లిక్‌ చేస్తే ఒక జాబితా కనిపిస్తుంది. అందులో స్టార్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే ఆ మెసేజ్‌ స్టార్డ్‌ మెసేజ్‌లోకి వెళ్లిపోతుంది. తిరిగి వాటిని చూడాలంటే సెట్టింగ్స్‌లో స్టార్డ్‌ మెసేజెస్‌లోకి వెళితే మీరు స్టార్‌ చేసిన మెసేజ్‌లు తేదీల వారీగా కనిపిస్తాయి.


అవసరం లేకుంటే డిలీట్ అంతే..

వాట్సాప్‌లో ఎక్కువ మందిని వేధించే సమస్య స్టోరేజ్‌. ఫోన్‌ మెమరీలో వాట్సాప్‌లో వచ్చిన మీడియా ఫైల్స్‌దే అగ్రస్థానం. అందుకే స్టోరేజ్‌  సమస్య రాకుండా ఉండాలంటే ఎక్కువ సైజున్న మీడియా ఫైల్స్‌ని ఎప్పటికప్పుడు డిలీట్ చేయాలి. మరి వాటిలో వేటి సైజు ఎంత అనేది ఎలా తెలుస్తుంది. అలా అని ప్రతి ఛాట్ ఓపెన్ చేసి ఫైల్‌ సైజ్‌ చూడాలంటే చాలా కష్టం. అందుకే వాట్సాప్‌ మెమరీలో 5ఎంబీ కన్నా ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్‌ని ప్రత్యేకంగా చూపించేలా యాప్‌ని అప్‌డేట్ చేశారు. వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో స్టోరేజ్‌ అండ్‌ డేటాపై క్లిక్ చేయాలి. తర్వాత మేనేజ్‌ స్టోరేజ్‌పై క్లిక్‌ చేస్తే 5ఎంబీ కన్నా ఎక్కవు సైజ్ ఉన్న ఫైల్స్‌ జాబితా ముందు వరుసలో చూపిస్తుంది. అందులో అవసరం లేని ఫైల్స్‌ని డిలీట్ చేసి స్టోరేజ్‌ సమస్యను అధిగమించొచ్చు.


ఓపెన్‌ చేయకుండానే చదివేయండి మరి..

మీకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌లను పూర్తిగా చదవాలంటే తప్పక ఛాట్ ఓపెన్‌ చేయాల్సిందే. అయితే ఛాట్ ఓపెన్ చేయకుండా మెసేజ్‌ చదవొచ్చు. దీని వల్ల మీరు మెసేజ్‌ చూసారా లేదా అనేది అవతలి వారికి తెలియదు. ఈ ఫీచర్ కోసం వాట్సాప్‌ వెబ్ ఓపెన్‌ చేయాలి. తర్వాత మౌస్‌ కర్సర్‌ని మీకు వచ్చిన మెసేజ్‌పై ఉంచాలి. క్లిక్‌ చేయకూడదు. అలా కర్సర్‌ మెసేజ్‌ మీద ఉంచితే చివరగా మీకు వచ్చిన మెసేజ్‌ను చిన్న పాప్‌-అప్ విండోలో చూపిస్తుంది. అలా మెసేజ్‌ ఓపెన్‌ చేయకుండా చదివేయొచ్చన్నమాట.


స్టేటస్‌ చూసినట్టు తెలియకూడదంటే..

రోజువారీ జీవితంలో మనం చేసే పనులు..అభిరుచులు, ఇష్టాలను తెలియజేస్తూ వాట్సాప్‌ స్టేటస్‌ పెడుతుంటాం. అలా అప్‌డేట్‌ చేసిన స్టేటస్‌ని రీడర్‌ రిసిప్ట్‌ ఫీచర్‌తో ఎవరెవరు చూసారనేది మనకు తెలుస్తుంది. అయితే మనం ఇతరుల స్టేటస్‌ చూసినట్లు వారికి తెలియకూడదంటే రీడర్‌ రిసిప్ట్‌ని డిసేబుల్ చేయాలి. అలా చేస్తే మీరు ఇతరుల స్టేటస్‌ చూసినట్లు వారికి తెలియదు. అయితే ఇందులో చిన్న సమస్య ఉంది. రీడర్‌ రిసిప్ట్ డిసేబుల్ చేయడం వల్ల మీ స్టేటస్‌ని ఎవరెవరు చూసారనేది మీకు తెలియదు. అలానే రీడర్‌ రిసిప్ట్‌ డిసేబుల్ చేస్తే వాట్సాప్‌లో ఇతరుల నుంచి వచ్చే మెసేజ్‌లు మీరు చూసినప్పుడు వచ్చే బ్లూటిక్‌ కూడా రాదు.


వెబ్‌ లాగౌట్‌ మర్చిపోయారా..కంగారేంలేదు..

ఆఫీస్‌ లేదా ఇంట్లో ఉన్నప్పుడు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా వాట్సాప్‌ని వెబ్‌ పేజీలో యాక్సెస్‌ చేస్తుంటాం. అయితే కొన్ని సార్లు కంగారులో లాగౌట్‌ చేయడం మర్చిపోతుంటాం. అక్కడి నుంచి వచ్చాక లాగౌట్‌ చేయలేదని గుర్తొస్తుంది. అలాంటప్పుడు మీ మొబైల్ నుంచే వెబ్‌ వాట్సాప్‌ని కూడా లాగౌట్ చెయ్యొచ్చు. ఎలాగంటారా..మీ మొబైల్‌లో వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి..వాట్సాప్‌ వెబ్‌/డెస్క్‌టాప్‌పై క్లిక్ చేయాలి. అందులో మీరు లాగిన్‌ అయిన జాబితా చూపిస్తుంది. వాటి కింద లాగౌట్ ఫ్రం ఆల్‌ డివైజెస్‌ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే మీ వాట్సాప్‌ లాగిన్‌ అయి ఉన్న వెబ్‌ వాట్సాప్‌ పేజీల నుంచి లాగౌట్‌ అయిపోతారు. అలా ఎక్కడి నుంచైనా వెబ్‌ పేజ్‌ నుంచి లాగౌట్ చెయ్యొచ్చు. 


వాట్సాప్‌లో ఛాట్ నోట్స్‌..ఎలాగంటే..

వాట్సాప్‌లో ఛాట్ నోట్సా.. అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే నిజంగా ఇందులో ఆలాంటి ఫీచర్‌ ఉంటే ఎంతో బావుండేది. కానీ లేదు. మరి లేనప్పుడు ఎందుకు ఇదంతా అంటారా. ఏం లేదండీ..మీకు వాట్సాప్‌లో వచ్చే ఫొటోలు, లింక్స్‌, ఆడియో/వీడియో క్లిప్స్‌ లేదా మీ ఆలోచనలని అక్షర రూపంలో వాట్సాప్‌లో దాచుకోవాలనుకుంటారు. కానీ వాటిని సేవ్‌ చేస్తే అవి మీ ఫోన్‌లో ఉన్న గ్యాలరీలోకి వెళ్తాయి. అలా కాకుండా వాట్సాప్‌లో మాత్రమే ఉండాలంటే..మీ స్నేహితులు ఇద్దరితో మీరే ఒక గ్రూప్‌ క్రియేట్ చెయ్యండి. తర్వాత వారిని గ్రూప్‌లోంచి తొలగించండి. అలా ఆ గ్రూప్‌లో మీరు ఒక్కరే ఉంటారు. అప్పుడు మీకు వాట్సాప్‌లో వచ్చే వాటిని సదరు గ్రూప్‌లోకి ఫార్వార్డ్ చేస్తే సరిపోతుంది. ఒకరకంగా ఇది డమ్మీ గ్రూప్‌ క్రియేట్ చెయ్యడంలాంటిదే. అలా మీ కావాల్సిన మీడియా ఫైల్స్‌, యుఆర్‌ఎల్ లింక్స్‌, మీ ఆలోచనల్ని అందులో టైప్‌ చేసి దాచుకోవచ్చన్నమాట.


 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని