close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 26/05/2020 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బల్బీర్‌ వల్లే 1975 ప్రపంచకప్‌ గెలిచాం

భారత హాకీ ప్రపంచకప్‌ విజేత సారథి అజిత్‌ పాల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: 1975లో భారత హాకీ జట్టు ప్రపంచకప్‌ గెలవడానికి.. దిగ్గజ ఆటగాడు, నాటి మేనేజర్‌ సీనియర్‌ బల్బీర్‌ సింగే కీలకమని అప్పటి సారథి అజిత్‌ పాల్‌ పేర్కొన్నాడు. భారత హాకీ దిగ్గజాల్లో ఒకరైన బల్బీర్‌ మృతిచెందడంతో తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయినట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. తమ జట్టు విశ్వవిజేతగా నిలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పాడు. ఆ ప్రపంచకప్‌లో భారత్‌ లీగ్‌ దశలోనే ఆశలు వదులుకుందని, సరిగ్గా అప్పుడే జట్టు మేనేజర్‌గా ఉన్న బల్బీర్‌.. తమకు ధైర్యం నూరిపోశారని గుర్తుచేసుకున్నాడు. 

అజిత్‌పాల్‌ పీటీఐతో మాట్లాడుతూ నాటి విశేషాలను నెమరువేసుకున్నాడు. ‘లీగ్‌ స్టేజ్‌లో చెత్త ప్రదర్శనతో  నిరాశలో ఉన్నాం. అప్పుడే బల్బీర్‌ మమ్మల్ని బ్రేక్‌ఫాస్ట్‌ కోసం బయటకు తీసుకెళ్లారు. కోచ్‌ గురుచరణ్‌ సింగ్‌ కూడా మాతో ఉన్నారు. అక్కడ బల్బీర్‌.. ప్రతీ ఆటగాడితో ప్రత్యేకంగా మాట్లాడారు. తదుపరి మ్యాచ్‌ వెస్ట్‌జర్మనీని 2 గోల్స్‌తో ఓడించే అవకాశం ఉందని మా అందరికీ వివరించారు. నిన్నటి గురించి ఆలోచించకుండా తర్వాతి మ్యాచ్‌ మీదే ధ్యాస పెట్టాలని బల్బీర్‌ మాతో అన్నారు. ఆయన మాటలకు స్ఫూర్తి పొందిన మేము జర్మనీపై 3-1తో గెలిచి సెమీస్‌కు చేరాము. అక్కడ మలేషియాను 3-2తో ఓడించి పాక్‌తో తుదిపోరుకు సిద్ధమయ్యాము. ఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థిని 2-1తో ఓడించి ప్రపంచకప్‌ ముద్దాడాము’ అని పేర్కొన్నాడు.

ఇక ఫైనల్లో పాక్‌పై రెండో గోల్‌ సాధించి జట్టును విజేతగా నిలిపిన అశోక్‌కుమార్‌ బల్బీర్‌ గురించి వివరిస్తూ.. భారత హాకీ చరిత్రలో ఆయన అత్యున్నత ఆటగాడని చెప్పాడు. ఇక 1971లో ఇదే పాకిస్థాన్‌తో భారత్‌ సెమీస్‌లో ఓడిపోయిందని, అప్పుడు బల్బీర్‌ జట్టుకు కోచ్‌గా ఉన్నారని అశోక్‌ పేర్కొన్నాడు. సెమీస్‌లో జట్టు ఓటమిపాలయ్యాక ఆయన హోటల్‌ గదిలో చాలా బాధపడ్డారని గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా బల్బీర్‌ను.. తన తండ్రి ధ్యాన్‌ చంద్‌తో పోల్చడంపై స్పందించిన అశోక్‌.. అది సరైంది కాదన్నాడు. ధ్యాన్‌చంద్‌, బల్బీర్‌.. ఇద్దరూ భారత హాకీలో అత్యున్నత శిఖరాలని కీర్తించాడు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.