స్టోక్స్‌ చేయలేనిది ఏదీ లేదు: మైఖేల్‌ వాన్‌
close

తాజా వార్తలు

Published : 19/07/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టోక్స్‌ చేయలేనిది ఏదీ లేదు: మైఖేల్‌ వాన్‌

లండన్‌: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ క్రికెట్‌లో చేయలేనిది ఏదీ లేదని ఆ జట్టు మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌ ప్రశంసించాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో స్టోక్స్‌ (176; 356 బంతుల్లో 17x4, 2x6) శుక్రవారం భారీ శతకం చేసిన సంగతి తెలిసిందే. దీంతో టెస్టుల్లో పదో శతకం పూర్తి చేశాడు. మరోవైపు సిబ్లీ (120; 372 బంతుల్లో 5x4) సైతం శతకంతో కదం తొక్కగా ఆ జట్టు భారీ స్కోర్‌ సాధించింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను 469/9 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసింది. 

ఈ నేపథ్యంలోనే వాన్‌ స్టోక్స్‌ను మెచ్చుకుంటూ తాజాగా ఓ ట్వీట్‌ చేశాడు. ‘ఉత్తమ ఇంగ్లాండ్‌ ఆటగాడు, ఉత్తమ ఫీల్డర్‌, అత్యుత్తమ బౌలర్‌, అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ప్రస్తుతం కొనసాగుతున్నాడు’ అతను చేయలేనిది ఏదీ లేదని మెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా, విండీస్‌ తొలి టెస్టులో ఆతిథ్య జట్టుకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం అంచనాల్లేని కరీబియన్‌ జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించింది. దీంతో చాలా రోజుల విరామం తర్వాత జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ మంచి ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టులోనైనా గెలవాలని ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ పట్టుదలగా ఆడారు. మరోవైపు కరీబియన్‌ శుక్రవారం 14 ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేసి ఒక వికెట్‌ కోల్పోయి 32 పరుగులు చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని