close

తాజా వార్తలు

Published : 06/12/2020 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫార్చూన్‌ ఉత్తమ వ్యాపారవేత్తల్లో భారతీయులు

అగ్రస్థానంలో ఎలాన్‌ మస్క్‌

న్యూయార్క్‌: ఫార్చూన్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2020 జాబితాలో అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్, మాస్టర్‌కార్డ్‌ సీఈఓ అజయ్‌ బంగా చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ భారత సంతతికి చెందినవారే కావడం ప్రత్యేకం. టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ అగ్రస్థానంలో నిలిచారు. మస్క్‌ వరుసగా రెండోసారి ఈ జాబితాలో అగ్రస్థానం పొందడం గమనార్హం. కరోనా సంక్షోభ ప్రభావం ఉన్నప్పటికీ.. ఇతర దిగ్గజ నాయకులు సైతం గణనీయ పనితీరు కనబరిచినట్లు ఫార్చూన్‌ తెలిపింది.

ఫార్చూన్‌ జాబితాలో 8వ స్థానంలో నారాయణ్‌ ఉన్నారు. ఆయన సారథ్యంలో అడోబ్‌ డిజైన్, పబ్లిషింగ్‌ టూల్స్‌ మరింత మందికి చేరువయ్యాయని వెల్లడించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ కంపెనీ మూడో త్రైమాసికంలో 14 శాతం వృద్ధితో 3.3 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదుచేసింది. గత పదేళ్లుగా మాస్టర్‌కార్డ్‌ సీఈఓగా వ్యవహరిస్తున్న బంగా ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. త్వరలోనే ఆయన పదవి నుంచి వైదొలగనున్నారు. 2021 జనవరి 1 నుంచి కొత్త సీఈఓగా మైకేల్‌ మైబాచ్‌ పనిచేయనున్నారు. ఫార్చూన్‌ 20 మంది జాబితాలో అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైసెస్‌ సీఈఓ లీసా సూ (2వ స్థానం), నెట్‌ఫ్లిక్స్‌ సీఈఓ రీడ్‌ హేసింగ్స్‌ (4), ఫోర్టీస్కూ మెటల్స్‌ గ్రూప్‌ సీఈఓ ఎలిజబెత్‌ గెయిన్స్‌ (5), అమెజాన్‌ జెఫ్‌ బెజోస్‌ (7), ఇంట్యూట్‌ సీఈఓ సాసన్‌ గూడార్జి (16) నిలిచారు.

ఇవీ చదవండి..
చిన్న పట్టణాల నుంచే 59% ఆర్డర్లు

డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియాలోకి రూ.2,500 కోట్లు


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని