close

తాజా వార్తలు

రావులపాలెం వద్ద కార్లు ఢీ:నలుగురు మృతి

రావులపాలెం: పండగపూట విషాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని రావులపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. విజయవాడ వైపు వెళ్తున్న కారు డివైడర్‌ దాటి అవతలి వైపు నుంచి వస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు కార్లు నుజ్జునుజ్జవగా.. ప్రమాదం తీవ్రతకు ఓ కారు ఇంజిన్‌ ఊడి బయటకు వచ్చేసింది.

 




Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.