
తాజా వార్తలు
ఏపీలో మరో 4 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఏపీలో మహమ్మారి కరోనా అంతకంతకూ వ్యాపిస్తోంది. ఇప్పటికే 40 కేసులు నమోదు కాగా.. తాజాగా మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దిల్లీలో సమ్మేళనానికి వెళ్లివచ్చిన నలుగురు విశాఖ వాసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 44కు చేరింది. ఈ మొత్తం కేసుల్లో ప్రకాశంలో 11, విశాఖలో 10, గంటూరులో 9 కేసులు, కృష్ణాలో 5, తూ.గో జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 2, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు తెలిపింది. నిన్న రాత్రి 9 తర్వాత మొత్తం 256 నమూనాలను పరీక్షించగా వాటిలో 21 పాజిటివ్, 235 నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయని వెల్లడించింది.
Tags :
జనరల్
జిల్లా వార్తలు