యూపీలో ఘోర ప్రమాదం..14 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 20/11/2020 12:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో ఘోర ప్రమాదం..14 మంది మృతి

 

ప్రతాప్‌గడ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతిచెందారు. వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్‌ సమీపంలోని మాణిక్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వచ్చే కుండా కొత్వాల్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కుండా నుంచి ప్రయాగ్‌రాజ్‌ వైపు వెళుతున్న ఓ బొలెరో వాహనం.. వేగంగా వచ్చి రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుకభాగంలో ఢీకొట్టింది. దీంతో బొలెరోలో ఉన్న 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. భారీ శబ్దం విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ, ప్రమాద తీవ్రతను చూసి ఎవరూ మృతదేహాల్ని వెలికితీసే సాహసం చేయలేకపోయారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కొద్ది సేపటి తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని వాహనాన్ని ఎక్కడికక్కడ కట్‌ చేసి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని