close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120027898 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => qkOnE-uHWS8 [video_short_link] => qkOnE-uHWS8 [created_by] => [created_date] => [modified_by] => 9030386 [modified_date] => 2020-02-27 18:54:17.575208 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

72 ఏళ్ల ఆ వృద్ధురాలికి విముక్తి 

హైదరాబాద్‌: నగరంలోని రాంనగర్‌లో 72 ఏళ్ల వృద్ధురాలిని ఇంట్లో బందించిన ఘటనపై అధికారులు స్పందించారు. ఇంటి తాళం పగులగొట్టి బందీ నుంచి ఆమెకు విముక్తి కలిగించారు. వృద్ధురాలిని తన భర్త ఇంట్లో పెట్టి తాళంవేసి వెళ్లిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎనిమిది నెలలుగా ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మనోవేదనను గుర్తించిన ఇంటి యజమానురాలు ఆమెకు కిటికీలోంచి రోజూ ఆహారాన్ని అందించేది. ఈ ఘటనపై ‘ఈనాడు’లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు, పోలీసులు వృద్ధురాలికి విముక్తి కల్గించారు. అక్కడికి చేరుకుని ఇంటి తాళం పగులగొట్టి ఆ బామ్మను నగరంలోని ఓ వృద్ధాశ్రమానికి తరలించారు.

ఆయన రేపు వచ్చేస్తారుగా..!

తాజా ఘటనపై బామ్మ స్పందించారు. పోలీసుల చొరవతో బందీ నుంచి విముక్తి పొందిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఆయన పొలం అమ్మడానికి వెళ్లారు. ముందు ఒకసారి వెళ్లారు.. మళ్లీ ఇప్పుడెళ్లారు. గతసారి వెళ్లినప్పుడు నాలుగునెల్లో తిరిగి వచ్చారు. అప్పుడు కూడా ఇంటి యజమానురాలే భోజనం పెట్టింది. అయితే అది ఆయన వచ్చాక అద్దెతోపాటు డబ్బు కట్టేశాము. ఇప్పుడు కూడా అలానే కడతాము. ఆయన రేపు వచ్చేస్తారుగా’’ అని వివరించారు. 

మరోవైపు వృద్ధురాలి నిర్బంధం ఘటనపై ఆమె భర్త గంగాధర్‌ సన్నిహితుడు శేషగిరి రావు స్పందించారు. రెండు రోజుల్లో గంగాధర్‌ నగరానికి వస్తాడని ఈటీవీకి తెలిపారు. గ్రామంలోని భూమిని విక్రయించేందుకు వెళ్లారని వృద్ధురాలి విషయంలో గంగాధర్‌ సైతం ఆందోళన చెందుతున్నారని తెలిపారు. భూమిని అమ్మటంలో ఆలస్యం కావడం వల్లే ఆమెను ఇంటి వద్ద ఉంచినట్లు శేషగిరి రావు ఫోన్‌ ద్వారా తెలిపారు. 

ఇదీ చదవండి..
ఎనిమిది నెలలుగా ఇంట్లోనే ఒంటరిగా వృద్ధురాలు

 

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.