close

తాజా వార్తలు

పెళ్లి బహుమతిగా ఉల్లి..

కర్ణాటక : ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పలువురు వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కొంతమంది ఉల్లిని బంగారంతో పోల్చితే.. మరికొందరు వినూత్నంగా బహుమతుల రూపంలో ఉల్లిని ఇస్తున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ యువ జంట వివాహంలో ఉల్లి పెళ్లి బహుమతిగా మారింది. కిలో రూ.150 చొప్పున కొనుగోలు చేసిన రెండు కేజీల ఉల్లిగడ్డలను ఆ యువజంటకు స్నేహితులు కానుకగా అందించారు. ఈ విషయం తెలియక ఆ కొత్త జంట ఆ కానుకను తెరవగానే ఒక్కసారిగా పెళ్లి మండపంలో నవ్వులు విరబూశాయి.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.