close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 19/05/2020 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లక్ష కేసులు: ఏ దేశానికి ఎంత కాలమంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు 49లక్షల మందికి ఈ వైరస్‌ సోకగా వీరిలో 3లక్షల 20వేల మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా లక్ష కేసుకుపైగా పాజిటివ్‌ కేసులు 11దేశాల్లో నమోదయ్యాయి. వీటిలో భారత్‌ మంగళవారం నాటికి 1,01,139 పాజిటివ్‌ కేసులతో 11వ స్థానానికి ఎగబాకింది. అయితే, 100కేసుల నుంచి లక్ష కేసులు నమోదుకావడానికి భారత్‌కి 64రోజుల సమయం పట్టింది. కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న అమెరికా, స్పెయిన్‌లలో కన్నా లక్ష కేసులు నమోదుకావడానికి భారత్‌ రెట్టింపు రోజుల సమయం తీసుకుంది. 

ఇక మెరుగైన ఆరోగ్య సదుపాయాలున్న జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాల్లో వైరస్‌ విజృంభణతో భారత్‌ కంటే తక్కువ రోజుల్లోనే వంద నుంచి లక్ష పాజిటివ్‌ కేసులు నమోదుచేసుకున్నాయి. ఆ సమయంలో వేగంగా విస్తరిస్తోన్న వైరస్‌ను కట్టడి చేయడంలో ఆయా దేశాలు విఫలమయ్యాయి. అమెరికాలో కేవలం 25రోజుల్లోనే వంద నుంచి లక్షమందికి సోకగా స్పెయిన్‌లో 30 రోజులు, జర్మనీలో 35రోజుల్లో లక్ష కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్‌ తీవ్రతకు అతలాకుతలమైన ఇటలీలో 36 రోజుల్లో లక్ష కేసులు దాటగా ఫ్రాన్స్‌కు 39 రోజులు, బ్రిటన్‌కు 42రోజుల సమయం పట్టింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష మందికి సరాసరి 60 పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా.. భారత్‌లో మాత్రం ఇది 7.1గా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అదే అమెరికాలో మాత్రం ప్రతి లక్ష జనాభాకు 431మంది దీని బారినపడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బ్రిటన్‌లో ప్రతి లక్ష జనాభాకు 361 మంది, స్పెయిన్‌లో 494, ఇటలీలో 372, జర్మనీలో 210, ఫ్రాన్స్‌లో 209 మంది ఈ వైరస్‌ బారినపడుతున్నారు.

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా గల భారత్‌, కరోనా కట్టడిలో అద్బుత పనితీరు కనబరిచిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా వైరస్‌ వ్యాప్తిని తగ్గించడంతోపాటు మరణాలు సంఖ్యలోనూ ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉంది. కొన్ని దేశాల్లో కొవిడ్‌ మరణాల రేటు 16శాతం ఉండగా భారత్‌లో దాదాపు 3శాతం ఉండటం ఊరటనిచ్చే విషయం. ఇదిలాఉంటే, మంగళవారం నాటికి భారత్‌లో మొత్తం 1,01,139 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 3163 మంది మృత్యువాతపడ్డారు. అంతేకాకుండా భారత్‌లో రికవరి రేటు కూడా ఆశాజనకంగా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కొవిడ్‌-19 రికవరి రేటు దాదాపు 38శాతంగా ఉంది.

ఇవీ చదవండి..

భారత్‌లో లక్ష దాటిన కరోనా కేసులు!

కొవిడ్‌ డాగ్‌: పరిశోధనల కోసం రూ.4.5కోట్లు!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.