
తాజా వార్తలు
గ్రేటర్ పోరు.. మూడు చోట్ల భాజపా గెలుపు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు భాజపా మూడు చోట్ల విజయం సాధించింది. అడిక్‌మెట్, గచ్చిబౌలి, ముషీరాబాద్ డివిజన్లలో కాషాయ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అడిక్‌మెట్‌లో సునీతా ప్రకాశ్‌గౌడ్, గచ్చిబౌలిలో గంగాధర్‌రెడ్డి, ముషీరాబాద్‌లో సుప్రియా గౌడ్ జయకేతనం ఎగురవేశారు. మరోవైపు ఇప్పటి వరకూ తెరాస 11 స్థానాల్లో, ఎంఐఎం 17 చోట్ల విజయం సాధించాయి. ప్రస్తుతం తెరాస 46, భాజపా 36, ఎంఐఎం 16 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
Tags :