close

తాజా వార్తలు

Updated : 23/10/2020 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 1 PM

1. డబ్బు కోసమే హత్య: ఎస్పీ కోటి రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన దీక్షిత్‌ రెడ్డి (9) కిడ్నాప్‌, హత్య కేసులో నిందితుడిని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. దర్యాప్తులో తేలిన వివరాలను మీడియాకు వివరించారు.నిందితుడు దీక్షిత్‌ను ఆదివారమే కిడ్నాప్‌ చేసి, హత్యకు పాల్పడ్డాడని కోటిరెడ్డి తెలిపారు. తెలిసిన వాళ్లే కిడ్నాప్‌ చేసి ఉంటారన్న కోణంలోనే విచారణ చేపట్టామన్నారు. నిందితుడు సాగన్‌ స్థానికుడు కావడంతో సీసీ కెమెరాలు ఎక్క ఉన్నాయో అతడికి సంపూర్ణ అవగాహన ఉందని చెప్పారు. డబ్బు సంపాదించాలన్న దురాశతోనే మందసాగర్‌ ఒక్కడే ఈ దారుణానికి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఎనిమిదో రోజున స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఆలయం లోపలే వేడుకలు జరుగుతున్నందున రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేశారు. సర్వభూపాలుడు అంటే అందరూ రాజులేనని అర్థం. ఈ సర్వభూపాలకుల్లో దిక్పాలకులూ చేరుతారు. విష్ణు అంశలేనివాడు రాజు కాలేడు. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే అని వేదాల వర్ణన. శ్రీహరి రాజాధి రాజు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జగిత్యాలలో ఉద్రిక్తంగా మారిన మహాధర్నా

మక్కలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, సన్న రకాలను కనీసం రూ.2,500కు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జగిత్యాలలో రైతులు తలపెట్టిన మహాధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. జగిత్యాల కలెక్టరేట్‌ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడగా.. పోలీసులు అడ్డుకున్నారు. వారి నుంచి తప్పించుకొని వచ్చి కలెక్టరేట్‌ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జగిత్యాల పట్టణం, రూరల్‌ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఎలాంటి ధర్నాలు, రాస్తోరోకోలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. మహాధర్నాకు తరలివస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. త్వరలో 20వేల పోలీస్‌ ఉద్యోగాల భర్తీ

తెలంగాణలో త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ ద్వారా ఇప్పటి వరకు 1,25,848 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా 18,428 మంది ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. తెలంగాణ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందిన 1162 ఎస్సైల పాసింగ్ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 256 మంది మహిళా ఎస్సైలు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దీక్షిత్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సత్యవతి

మహబూబాబాద్‌లో జిల్లాలో కిడ్నాప్‌ అనంతరం దారుణహత్యకు గురైన దీక్షిత్‌రెడ్డి (9) కుటుంబాన్ని మంత్రి సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. వాళ్ల స్వగ్రామం శనిగపురం వెళ్లి బాలుడి తల్లిదండ్రులు రంజిత్‌రెడ్డి, వసంతతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్‌, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సాంకేతికతతో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం చాలా బాధాకరమని మంత్రి అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రభాస్‌ బర్త్‌డే స్పెషల్‌ ఆగయా..!

డార్లింగ్‌ అభిమానులకు బర్త్‌డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. గత కొన్నిరోజుల నుంచి అప్‌డేట్‌ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల కోసం ‘రాధేశ్యామ్‌’ నుంచి వచ్చిన స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న అపురూపమైన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని తాజాగా చిత్రబృందం తొలి‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ పేరుతో విడుదలైన ఈ పోస్టర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా తొలి ఔషధానికి ఆమోదం!

కొవిడ్‌-19 రోగులకు చికిత్స అందించే తొలి ఔషధానికి గురువారం అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా ఇస్తున్న యాంటీవైరల్‌ డ్రగ్‌ రెమిడెసివిర్‌ను పూర్తిస్థాయి కరోనా ఔషధంగా వినియోగించేందుకు అనుమతించింది. దీంతో కరోనా చికిత్సకు ఆమోదం పొందిన తొలి ఔషధంగా రెమిడెసివిర్‌ నిలిచింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఔషధ తయారీ సంస్థ గిలీద్‌ సైన్సెస్‌ రెమిడెసివిర్‌ను వెక్లరీ పేరిట ఉత్పత్తి చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కరోనా ఎఫెక్ట్‌: పెరిగిన కార్ల విక్రయాలు

కరోనా వైరస్‌ ప్రభావంతో అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ప్రజా రవాణా పట్ల ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయింది. కుటుంబ సభ్యుల భద్రత నేపథ్యంలో సొంత వాహనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగిపోయాయి. కొనుగోళ్లతోపాటు ధరలు సైతం అమాంతం పెరిగాయి. ఒకప్పుడు ధనవంతులు మాత్రమే కార్లను ఎక్కువగా వినియోగించేవారు. కరోనా ప్రభావంతో ప్రస్తుతం మధ్యతరగతి వారు కార్లపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విజయవంతమైన నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం!

భారత నావికాదళం శుక్రవారం నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్‌) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. క్షిపణి కార్వెట్‌ ఐఎన్‌ఎస్‌ ప్రబల్‌ నుంచి అరేబియా సముద్రంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఉపయోగంలో లేని ఓ నౌకను లక్ష్యంగా ఉంచారు. గరిష్ఠ దూరంలో ఉంచిన ఈ లక్ష్యాన్ని క్షిపణి అత్యంత కచ్చితత్వంతో చేరినట్లు నావికాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 150స్పీడ్‌తో బంతులేస్తుంటే ఏం చేయలేం

హైదరాబాద్‌ జట్టుకూ మిడిల్‌ ఆర్డర్‌ బలముందని చూపించడం బాగుందని ఆ జట్టు సారథి డేవిడ్ వార్నర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. గతరాత్రి రాజస్థాన్‌పై వార్నర్‌ టీమ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వార్నర్‌ మాట్లాడుతూ.. ‘మేం ప్రారంభించిన విధానం అద్భుతమని అనుకుంటా. పవర్‌ప్లే తర్వాత ఆటను మా చేతుల్లోకి తెచ్చుకోగలిగాం. ఇదొక సంపూర్ణ విజయం. విజయ్‌ శంకర్‌, మనీష్‌ పాండే రాణించడం బాగుంది. వాళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఒక బౌలర్‌ 150 కిమీ వేగంతో బంతులేస్తుంటే ఏం చేయలేం. వీలైతే ఎదురుదాడి చేయాలి. నా విషయంలో మాత్రం ఔటయ్యా’ అని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.