close

తాజా వార్తలు

Published : 05/07/2020 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. భార‌త్‌: ఒక్క‌రోజే 24,850 కేసులు, 613 మ‌ర‌ణాలు!

దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం దాల్చింది. గ‌త వారం రోజులుగా భార‌త్‌లో నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా నిన్న ఒక్క‌రోజే అత్య‌ధికంగా 24,850 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా నిత్యం సంభ‌విస్తున్న క‌రోనా మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. శ‌నివారం ఒక్క‌రోజే దేశంలో 613మ‌ర‌ణాలు చోటుచేసుకోవ‌డం మ‌హ‌మ్మారి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. దేశ‌వ్యాప్తంగా ఒక్క‌రోజు గ‌డువులో ఈ స్థాయిలో మ‌ర‌ణాలు, కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 7, 8 తేదీల్లో కడప జిల్లాలో జగన్‌ పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల ఏడో తేదీ సాయంత్రం విజయవాడ నుంచి ఇడుపులపాయకు చేరుకోనున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని 8 వ తేదీ ఉదయం వైఎస్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

దేశరాజధాని దిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభమైంది. సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా పిలుస్తున్న దీన్ని ఆదివారం ఉదయం లెఫ్టినెంట్‌ గర్నర్‌ అనిల్‌ బైజల్‌ ప్రారంభించారు. 10వేల పడకలతో దీన్ని ఏర్పాటు చేశారు. నోడల్‌ ఏజెన్సీగా ఆస్పత్రిని ఐటీబీపీ నిర్వహిస్తోంది. రాధా సోమి బియాస్‌ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన కొంతమంది స్వచ్ఛందంగా సేవలందించనున్నారు. ఛత్తర్‌పూర్‌లో 70ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నేటి నుంచి పోస్టుకార్డు ఉద్యమం: కోదండరెడ్డి

 తెలంగాణలో భూ రికార్డుల సవరణ పూర్తయ్యి నేటికి రెండున్నరేళ్లు గడుస్తున్నా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందలేదని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. పాస్‌పుస్తకాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.  వారి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నేటి నుంచి కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సిబ్బందికి కరోనా.. తితిదే అప్రమత్తం

తిరుమలలో  కరోనా కేసులు పెరుగుతుండడం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో 3 నెలల విరామం అనంతరం భక్తుల్ని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో భక్తులకు సేవలందించే తితిదే సిబ్బంది కరోనా బాధితులుగా మారుతుండడం శ్రీవారి దర్శనాలపై ప్రభావం  చూపుతోంది. భక్తుల నుంచి నమూనాలు సేకరించినట్లే ఉద్యోగుల నుంచీ విస్తృత సంఖ్యలో  నమూనాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మరో డోక్లాంకు చైనా సన్నాహాలు  

ఇళ్ల సరిహద్దు తగాదాలు సాధారణంగా గోడల వరకే పరిమితం అవుతాయి. దేశాలైనా అంతే.. సరిహద్దులు ఉన్నంత వరకే ఉంటాయి. అంతేగానీ పక్కింటివాళ్లు వచ్చి ‘‘మీ వంటిల్లూ మాదే’’ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు భూటాన్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. చైనా ఏకంగా తనకు ఏమాత్రం సరిహద్దులేని భూటాన్‌లోని ఓ భూభాగాన్నీ తమదనే చెబుతోంది. ప్రపంచ దేశాలు కూడా ఈ ప్రకటనతో కొంచెం ఆశ్చర్యపోయాయి. ఆ తర్వాత చైనా తత్వం తెలుసుకొని దీని తీరు ఇంతేలే అనుకొన్నాయి. భారత్‌పై అక్కసుతోనే ఇలా చేస్తోందని అర్థం చేసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దిల్లీలో ఇళ్లలోనే కోలుకుంటున్నారు: కేజ్రీవాల్‌

దిల్లీలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగతోందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స అవసరమవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోందని పేర్కొన్నారు. చాలా మంది ఇళ్లలోనే కోలుకుంటున్నారన్నారు. గత వారం రోజుకి సగటున 2300 కేసులు నమోదైనప్పటికీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య మాత్రం 6200 నుంచి 5300కు తగ్గిందని తెలిపారు. కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 10 వేల పడకలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పుల్వామాలో పేలుడు..గాయపడ్డ జవాన్‌

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. పుల్వామా జిల్లా గుంగూ ప్రాంతంలో ఐఈడీని పేల్చారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఓ సీర్పీఎఫ్‌ జవాన్‌ స్వల్పంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ బలగాలనే లక్ష్యంగా ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు భావిస్తున్నారు. పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మ‌హారాష్ట్రలో 2ల‌క్ష‌లు దాటిన కేసులు!

మ‌హారాష్ట్రలో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. దేశంలోనే అత్య‌ధిక తీవ్రత మ‌హారాష్ట్రలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా నిన్న‌ఒక్క‌రోజే రాష్ట్రంలో 7,074 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా గ‌డిచిన 24గంట‌ల్లో రాష్ట్రంలో 295కొవిడ్ రోగులు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 2,00,064కి చేరింది. వీరిలో ఇప్ప‌టి వ‌ర‌కు 8671మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో న‌మోద‌వుతున్న మొత్తం కొవిడ్ మ‌ర‌ణాల్లో 45శాతానికి పైగా కేవ‌లం ఇక్కడే సంభ‌విస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత ఆటగాళ్లు క్షమించమని అడిగేవాళ్లు

టీమ్‌ఇండియాపై పాకిస్థాన్‌ ఆధిపత్యం చెలాయించే రోజుల్లో మ్యాచ్‌లు పూర్తయ్యాక భారత ఆటగాళ్లు తమను క్షమించమని అడిగేవారని ఆ జట్టు మాజీ సారథి షాహిద్‌ అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా క్రిక్‌కాస్ట్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన మాజీ క్రికెటర్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అలాగే తన కెరీర్‌లో భారత్‌, ఆస్ట్రేలియా జట్లపై ఆడటం ఎంతో ఆస్వాదించేవాడినని చెప్పుకొచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని