
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 1 PM
1. మరో అడుగు వెనక్కి..?
డ్రాగన్ మెల్లగా దారికొస్తోంది.. సరిహద్దుల్లో ఆ దేశం ఉద్రికత్తలకు తెరితీస్తే.. భారత్ వాణిజ్య, భౌగోళిక రాజకీయ సమీకరణలతో చైనాకు జవాబిచ్చింది. ఆ ఫలితం మెల్లగా కనిపిస్తోంది. తాజాగా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కీలకమైన పాంగాంగ్ సరస్సు వద్ద నుంచి కూడా చైనా బలగాలను వెనక్కి తీసుకొంటోంది. ఇప్పటికే అక్కడ మోహరించిన పడవల సంఖ్యను గణనీయంగా తగ్గించేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలా?:కళా
ధికార వైకాపాలో రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చారని ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. లక్షలాది నిరుద్యోగులకు అన్యాయం చేశారని అన్నారు. ఎన్నికల ముందు హోదా తెస్తానన్న సీఎం మాట మార్చారని, కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేకహోదా తెస్తామన్న విషయం ఏమైందని ప్రశ్నించారు. పదోతరగతి కూడా పాసుకాని కొడాలి నానికి మంత్రి ఉద్యోగం ఇచ్చి..డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ చేసిన వాళ్లని వైన్ దుకాణాల్లో బేరరుగా పెట్టారని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. భారత్‌లో ఒక్కరోజే 28,637 కేసులు!
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గత కొన్నిరోజులుగా నిత్యం 25వేలకుపైగా రికార్డుస్థాయి కేసులతో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 28,637 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,49,553కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మరోసారి పెరిగిన డీజిల్ ధర!
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా డీజిల్‌పై 16పైసలు పెరిగింది. పెట్రోల్ ధర మాత్రం స్థిరంగా ఉంది. దీంతో హైదరాబాద్‌లో లీటరు డీజిల్ ధర రూ.79.04కు చేరగా పెట్రోలు ధర రూ.83.49గా ఉంది. దేశరాజధాని దిల్లీలో డీజిల్ ధర రూ.80.94కాగా, పెట్రోల్ ధర రూ.80.43గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌పై 8పైసలు, డీజిల్‌పై 18పైసలు పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. మాస్కుతో డొనాల్డ్ ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్కు ధరించి ప్రజలముందుకొచ్చారు. తాజాగా వాషింగ్టన్ సమీపంలోని వాల్టర్ రీడ్ మిలటరీ ఆసుపత్రి సందర్శన సమయంలో అధ్యక్షముద్ర ఉన్న మాస్కుతో ట్రంప్ కనిపించారు. వైద్యాధికారుల సూచన మేరకు ట్రంప్ ఈసారి మాస్కు ధరించినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఎక్కువమందికి ఉండే ఫోబియాలేంటో తెలుసా?
ప్రతి ఒక్కరికి కొన్ని భయాలుంటాయి. మనిషి లోపల ఎక్కడో ఆ భయాలు నాటుకుపోయి.. సందర్భాన్ని బట్టి బయటపడతాయి. ఎంత ధైర్యవంతులైనా నలుగురి మధ్యకు రావడానికి, మాట్లాడటానికి జంకేవాళ్లుంటారు. మరికొందరు పిడుగు శబ్దం వినిపిస్తే గజగజ వణికిపోతారు. ఇవే కాదు ఇలాంటి భయాలు చాలా ఉన్నాయి. వీటిని ఫోబియా అంటారు. భయానికి శాస్త్రీయ నామమే ఫోబియా. ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో సాధారణంగా పది రకాల ఫోబియాలు ఉంటాయట. అవేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రెమిడెసివిర్‌ను విచ్చలవిడిగా వాడొద్దు!
కొవిడ్-19కు ప్రయోగాత్మక చికిత్స విధానాలుగా నిర్దేశించిన రెమిడెసివిర్, టోసిలిజుమాబ్ వంటి ఔషధాలను కచ్చితంగా నిబంధనల మేరకే వాడేలా చూడాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), ఎయిమ్స్‌లు రాష్ట్రాలకు సూచించాయి. వాటిని విచ్చలవిడిగా వాడటం లేక వాడకూడని పరిస్థితుల్లో ఉపయోగించడం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుందని స్పష్టం చేశాయి. కొవిడ్‌కు నిర్దిష్టంగా ఎలాంటి చికిత్స లేని పరిస్థితుల్లో వీటిని సూచిస్తున్నట్లు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. భార్య శాంపిళ్లను పనిమనిషి పేరిట పంపి..
తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఓ వైద్యుడి చేసిన నిర్వాకం అతడిపై పోలీసు కేసు నమోదయ్యేటట్లు చేసింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న తన భార్య శాంపిళ్లను ఇంట్లో పనిమనిషి పేరిట పంపి పోలీసులకు చిక్కాడు ఆ వైద్యుడు. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు చూస్తే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. అమితాబ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది
కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నావావతి ఆస్పత్రి వర్గాలు ఆదివారం ఉదయం ప్రకటించాయి. లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోని ఐసోలేషన్ విభాగంలో ఉన్నట్లు తెలిపారు. ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఈసారి అంత ఈజీ కాదు: గంగూలీ
రాబోయే ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్ గెలవడం టీమ్ఇండియాకు అంతా ఈజీ కాదని, మళ్లీ 2018లా రిపీట్ కాదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేర్కొన్నాడు. అయితే, భారత్ మాత్రం అన్ని విభాగాల్లోనూ పటిష్టంగానే ఉందన్నాడు. తాజాగా ఇండియాటుడే ఇన్స్పిరేషన్ కార్యక్రమంలో మాట్లాడిన దాదా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి