close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 02/08/2020 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. చరిత్ర సృష్టించి తిరిగొస్తున్న క్రూడ్రాగన్‌!

తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ నిర్మించిన వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లిన అమెరికాకు చెందిన వ్యోమగాములు తిరుగుపయనమయ్యారు. శనివారం వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) నుంచి క్రూడ్రాగన్‌ వ్యోమనౌకలో ప్రయాణం ప్రారంభించారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7:35 గంటలకు వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌ నుంచి విడిపోయి భూమి దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చేతులారా పెరిగిన నీటి వినియోగం!

దేశంలో కొవిడ్‌-19 ఉద్ధృతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా విధించిన లాక్‌డౌన్‌ నాటి నుంచి ఇళ్లలో ప్రత్యేకంగా పట్టణాలు, నగరాల్లోని ఇళ్లలో నీటి వాడకం పెరిగిపోయింది. ఇళ్లకే పరిమితమైన ప్రజలు పదేపదే చేతులను శుభ్రం చేసుకోవడం, ఇంటిని క్రిమి రహితం చేసుకోవడమే ఇందుకు కారణం. కేంద్ర జల్‌ శక్తి శాఖ, జల సంరక్షణ కార్యకర్తలు చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఒక్కసారి చేతులను శుభ్రం చేసుకోవడానికి కనీసం రెండు లీటర్ల నీరు వాడుతున్నట్లు సర్వేలో తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.  ‘‘ఆనాడు మద్దతిచ్చి ఇప్పుడు మాటమార్చారు’’

అవినీతిపరుల పాలనలో మూడు ప్రాంతాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. సీఆర్‌డీఏ రద్దు చేయడం అభివృద్ధి అవుతుందా? అని ప్రశ్నించారు. ఏపీలో మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అమరావతి రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతు పలికిన తెదేపా నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. స్థానికుల ఆస్తులన్నీ భూకబ్జాదారులకు కట్టబెట్టడమే వైకాపా చేసే పని అని యనమల విమర్శించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత్‌లో ఒక్కరోజే 853 మంది మృతి!

గత కొన్నిరోజులుగా నిత్యం 700లకు పైగా నమోదవుతున్న మరణాల సంఖ్య, తాజాగా 800 మార్కును దాటింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 853మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కొవిడ్‌తో మరణించిన వారిసంఖ్య 37,364కు చేరింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 54,735 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఆదివారం నాటికి మొత్తం బాధితుల సంఖ్య 17,50,723కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెలంగాణలో 1,891 కేసులు.. 10 మరణాలు

5. క్రేన్‌ ఘటనలో మృతి చెందిన అల్లుడిని చూసేందుకు వెళ్తూ..

విశాఖలో నిన్న చోటుచేసుకున్న షిప్‌యార్డ్‌ ప్రమాదంలో మృతి చెందిన తమ అల్లుడిని చూసేందుకు వెళ్తున్న ఓ కుటుంబంలోని ఇద్దరితోపాటు, కారు డ్రైవర్‌ను రోడ్డు ప్రమాదం  బలితీసుకుంది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జలంతర కోట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని.. వీరు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ  ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కరోనాను జయించిన 110 ఏళ్ల బామ్మ

ప్రపంచమంతా కరోనాతో వణికిపోతున్న వేళ.. మహమ్మారి నుంచి కోలుకొని ఇళ్లకు చేరుతున్నవారి ఉదంతాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. వృద్ధులు సైతం మహమ్మారిని జయించి ఇంటికి చేరుతున్న ఘటనలు ఊరటగా నిలుస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు, అప్రమత్తతతో పాటు మనోధైర్యంతో ఉంటే వైరస్‌ మెడలు వంచడం పెద్ద సమస్యేమీ కాదన్న విశ్వాసాన్ని నింపుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన 110 ఏళ్ల సైదమ్మ అనే బామ్మ కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కరోనాతో యూపీ మంత్రి మృతి

7. మోహన్‌బాబు ఇంటి వద్ద హల్‌చల్‌ చేసిన దుండగుల అరెస్టు

సినీ నటుడు మోహన్‌బాబు ఫాంహౌస్‌ వద్ద హల్‌చల్‌ చేసిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి జల్పల్లిలోని ఆయన ఫాం హౌస్‌లోకి కొంతమంది దుండగులు దూసుకెళ్లి... మిమ్మల్ని వదలమంటూ కుటుంబ సభ్యులను హెచ్చరించారు. ఈ మేరకు పహాడిషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ 31ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నేడు మరోసారి భారత్‌-చైనా చర్చలు

 వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంట బలగాలను ఉపసంహరించుకునే విషయమై భారత్‌-చైనా సైన్యాల మధ్య నేడు మరోసారి చర్చలు జరగనున్నాయి. గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఇరు వర్గాలు సమావేశమవడం ఇది ఐదోసారి. ఎల్‌ఏసీ వెంట చైనా పరిధిలో ఉన్న మోల్డోలో ఉదయం 11 గంటల సమయంలో సమావేశం ప్రారంభమవనున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. కమాండర్‌ స్థాయిలో ఈ చర్చలు జరగనున్నాయి. ఈ భేటీలో.. ఫింగర్‌ ప్రాంతంలో బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. త్వరలోనే ‘మేక సూరి 2’ వస్తుంది!

‘‘దర్శకుడనేవాడు ఏ తరహా కథనైనా మనస్ఫూర్తిగా సొంతం చేసుకోగలగాలి. ఏ తరహా జోనర్‌ చెయ్యడానికైనా సిద్ధంగా ఉండాలని నమ్ముతా. నా వల్ల ఇది కాదు అని ఎప్పుడూ అనుకోను’’ అంటున్నారు త్రినాథ్‌ వెలిసెల. ‘మేక సూరి’ అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన దర్శకుడీయన. అభినయ్‌, సుమయ జంటగా నటించారు. ఇటీవలే ‘జీ 5’ ఓటీటీలో విడుదలైంది. ఈ నేపథ్యంలో త్రినాథ్‌ చెప్పిన సంగతులివి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘విరుష్క’ జంటకు 150  రోజుల ఎడబాటు!

టీమ్‌ఇండియా క్రికెటర్లకు విచిత్రమైన అనుభవం ఎదురవ్వనుంది! ఏడాది పొడవునా క్రికెట్‌ ఆడటం వల్ల సాధారణ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం దొరికేది కాదు. అయితే కొవిడ్‌-19 మహమ్మారితో దాదాపు నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబీకులతో కాలాన్ని ఆస్వాదిస్తున్నారు. మళ్లీ ఐపీఎల్‌ ఆరంభమైతే దాదాపు 150 రోజులు కుటుంబ సభ్యులను కలవడం కుదరదని తెలుస్తోంది. కోహ్లీ-అనుష్క, రోహిత్‌-రితిక, ధోనీ-సాక్షి సహా అనేక జంటలకు ఎడబాటు తప్పదు! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.