close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. ఇంటర్‌బోర్డు యూట్యూబ్‌ ఛానెల్‌

విద్యార్థుల కోసం యూట్యూబ్‌ ఛానెల్‌ను తీసుకొస్తామని, నిపుణులైన అధ్యాపకుల ద్వారా సబ్జెక్టుల పాఠ్యాంశాలపై వీడియోలు రూపొందించి ఆ ఛానెల్‌లో ఉంచుతామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. ఇప్పటికే కొన్ని చాలావరకు పాఠ్యాంశాలు తయారు చేశామని, వాటిలో తప్పొప్పుల పరిశీలన బాధ్యత థర్డ్‌ పార్టీకి అప్పగిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వీడియో పాఠాల తయారీకి బోర్డులో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఎమ్మార్‌ సొమ్ముకు ‘ఆసరా’

‘ఆసరా’ కంపెనీపై ఈడీ కేసును కొట్టివేయాలన్న పిటిషన్‌ను తిరస్కరించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) హైకోర్టును కోరింది. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ సొమ్ము రూ. 96.01 కోట్లలో రూ. 45.21 కోట్లు సౌత్‌ఎండ్‌ ప్రాజెక్ట్స్‌కు, అక్కడి నుంచి ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి (జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు) డైరెక్టర్‌గా ఉన్న ఆసరా థీమ్‌ ప్రాజెక్ట్స్‌కు రూ. 36.82 కోట్లు వెళ్లిందని ఈడీ హైకోర్టుకు నివేదించింది. ఎమ్మార్‌ ద్వారా ఆర్జించిన నేరపూరిత సొమ్ము ఆసరా కంపెనీ వద్ద ఉందని వెల్లడించింది. అందువల్ల ఆసరా కంపెనీపై ఈడీ కేసును కొట్టివేయాలన్న పిటిషన్‌ను తిరస్కరించాలని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3.  పారిశుద్ధ్య కార్మికుల జీవితాలపై రతన్‌ టాటా భావోద్వేగ వీడియో

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను చాటారు. పారిశుద్ధ్య కార్మికులు క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నారంటూ ఓ విద్యార్థి తన పాఠశాలలో చెప్పిన కవితకు సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌లో ఉంచారు. ఈ వీడియోను జత చేస్తూ రతన్‌ టాటా పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులను వివరిస్తూ వారిపై భారం తగ్గించేందుకు తాము చేస్తున్న కృషిని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇంటికెళ్తావ్‌

‘నువ్వు ఏం చేస్తున్నావో అన్నీ నాకు తెలుసు. తెదేపా వారితో కలసి నువ్వు చేస్తున్న వ్యవహారాలు వీడియోలతో సహా నా వద్ద ఉన్నాయి. అర్హత లేని వారికి పింఛన్లు, రేషన్‌ కార్డులు మంజూరు చేస్తున్నావు. ఉద్యోగం చేయాలని ఉంటే సక్రమంగా ఉండు, లేదంటే ఇంటికెళ్తావ్‌. ఉద్యోగం నుంచి తొలగింపజేయిస్తా’ అంటూ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు గుంటూరు జిల్లా కనగాల పంచాయతీ కార్యదర్శి సుభానిని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ‘ఈటీవీ భారత్‌’కు దక్షిణాసియా ఉత్తమ డిజిటల్‌ న్యూస్‌ స్టార్టప్‌ అవార్డు

మీడియా రంగంలో దూసుకెళుతున్న ‘ఈటీవీ భారత్‌’ అరుదైన ఘనత సాధించింది. దక్షిణాసియా బెస్ట్‌ డిజిటల్‌ న్యూస్‌ స్టార్టప్‌ అవార్డును గెలుచుకుంది. డిజిటల్‌ మీడియా రంగంలో ఉత్తమ ఆవిష్కరణలకు గాను... వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌ అండ్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ సంస్థ ‘వాన్‌-ఇఫ్రా’ ఈ పురస్కారాన్ని అందించింది. మంగళవారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ద క్వింట్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ రీతూ కపూర్‌ చేతుల మీదుగా ‘ఈటీవీ భారత్‌’ డైరెక్టర్‌ బృహతి చెరుకూరి ఈ అవార్డును స్వీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. పాల దిగుబడి వృద్ధిలో ప్రథమ స్థానం

రాష్ట్ర విభజన తర్వాత గత అయిదేళ్లలో పాల దిగుబడిలో 55% వృద్ధి సాధించి ఆంధ్రప్రదేశ్‌ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఉత్పత్తి పరిమాణం పరంగా నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. జాతీయ పాడి అభివృద్ధి మండలి (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు)గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. రాష్ట్ర విభజనకు ముందు అయిదేళ్లలో 24% ఉత్పత్తి వృద్ధి సాధించిన రాష్ట్రం ఆ తర్వాతి అయిదేళ్లలో అంతకు రెట్టింపు నమోదుచేసింది. ఈ రంగంలో గత అయిదేళ్లలో దేశం సగటున 6.4% వృద్ధి నమోదుచేస్తే రాష్ట్రంలో అది 11.72%గా నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఈ ఏడాది వేతనాలు 9.1% పెరుగుతాయ్‌!

భారత్‌లో కంపెనీలు ఈ ఏడాది సగటున 9.1 శాతం మేర వేతనాలను పెంచనున్నట్లు హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీ ఏఆన్‌ నివేదిక అంచనా వేసింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 2019లో 9.3 శాతం మేర వేతనాలు పెరిగాయి. 20 రంగాలకు చెందిన 1000కి పైగా సంస్థల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 39 శాతం సంస్థలు 10 శాతం మేర, 42 శాతం సంస్థలు 8-10 శాతం మధ్య వేతనాలను పెంచనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. బుమ్రాను ఇకపై అందరూ ఆడేస్తారు

భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఎదుర్కొనే విషయంలో అన్ని జట్లూ న్యూజిలాండ్‌ను అనుసరించే అవకాశముందని మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షేన్‌ బాండ్‌ అభిప్రాయపడ్డాడు. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేయడంతో కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో బుమ్రాకు ఒక్క వికెట్‌ కూడా దక్కని సంగతి తెలిసిందే. ‘‘న్యూజిలాండ్‌ బుమ్రాను సమర్థంగా ఎదుర్కొంది. అతణ్ని ప్రమాదకారిగా గుర్తించింది. వాళ్లు అతడి బౌలింగ్‌ను సంప్రదాయబద్ధంగా ఆడారు’’ అని బాండ్‌ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. నాన్నా.. నిను మరవలేకున్నా..

తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఓ యువతి.. ఆయన మృతదేహాన్ని తీసుకువస్తూ.. దారిలో గోదావరిలోకి దూకేసింది. ఆరవెల్లి సాయిప్రియ (32) మంచిర్యాల జిల్లా కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఇంకా వివాహం కాలేదు. ఆమె తండ్రి వసంత్‌ సోమవారం మంచిర్యాల నుంచి చెన్నూరుకు వస్తుండగా జైపూర్‌ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం కాగా ఆడపిల్లల్లో సాయిప్రియ చివరి సంతానం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఒక పాఠ్యగ్రంథం.. ‘శంకరాభరణం’

ఇప్పుడు చూసినా నలభై ఏళ్లు వెనక్కి వెళ్లిన అనుభూతిని కలగజేసే చిత్రం ‘శంకరాభరణం’ అన్నారు ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌. ఆయన తెరకెక్కించిన ‘శంకరాభరణం’ విడుదలై ఈ నెల 2తో 40 ఏళ్లు పూర్తయ్యాయి. జె.వి.సోమయాజులు, మంజుభార్గవి, చంద్రమోహన్‌ తదితరులు నటించిన ఆ చిత్రాన్ని ఏడిద  నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రమిది. నలభయ్యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపురమణ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.