close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/05/2020 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. దేశ చరిత్రను మలుపుతిప్పిన ఏడాది

అందరితో కలిసి.. అందరి వికాసానికి (సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌) అంటూ 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండోసారి గద్దెనెక్కిన నరేంద్ర మోదీ సర్కారు శనివారంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ ఏడాది కాలంలో భారతావనిపై చెరగని ముద్రవేస్తూ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాల్ని తీసుకుంది. కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ..   చారిత్రక తప్పులను సరిదిద్దుతున్నామని చెబుతూ.. పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి 100 రోజుల్లోనే సాహసోపేత చర్యలకు శ్రీకారం చుట్టింది. చివరి నెలల్లో కరోనా విరుచుకుపడినప్పటికీ..   మహమ్మారి బారి నుంచి దేశాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేసీఆర్‌ అంటే కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు

భారతదేశంలో అతి తక్కువ వయసు గల తెలంగాణ రాష్ట్రం కేవలం మూడేళ్ల వ్యవధిలోనే  ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల నీటి పారుదల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ దాకా 618 మీటర్ల ఎత్తు వరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని శుక్రవారం ట్విటర్‌లో తెలిపారు. కె అంటే కాల్వలు, సి అంటే చెరువులు, ఆర్‌ అంటే రిజర్వాయర్లుగా కేసీఆర్‌ పేరు సార్థకమైందని అభివర్ణించారు. కొండపోచమ్మ సాగర్‌ జలాశయం 2.85 లక్షల ఎకరాలకు నీరందించడమే గాక త్వరలో ప్రారంభించనున్న కేశవాపురం రిజర్వాయర్‌ ద్వారా హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా రాంరాం

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)తో తాము పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కరోనా విషయంలో ఆ సంస్థతో పాటు చైనా కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించి, ప్రపంచ వ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని ఆరోపించారు. వైరస్ విషయంలో కీలక అంశాలను దాటిచపెట్టినందుకు చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదై, తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమారే

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా.. ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌నే పదవిలో నుంచి తొలగిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. ఆ ఆర్డినెన్స్‌ను రద్దు చేస్తూ.. రమేశ్‌కుమార్‌ను తక్షణమే ఎస్‌ఈసీగా పునర్నియమించాలంటూ సంచలన తీర్పు ఇచ్చింది. చట్టనిబంధనలకు అనుగుణంగా ఆర్డినెన్స్‌ లేదని తేల్చిచెప్పింది. ఆగమేఘాల మీద ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన పరిస్థితులే లేవని వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణ ఇంట.. లక్ష కోట్ల పంట

తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల అనతికాలంలోనే నీటిపారుదల రంగంలో అద్భుతాలు సాధించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. మొత్తంగా 530 టీఎంసీల మేర గోదావరి జలాలను వినియోగించుకునే స్థాయికి చేరామన్నారు. ఇటీవల భవిష్యత్తు వ్యూహాలపై నిర్ణయం తీసుకునేందుకు ఓ సమావేశం నిర్వహించామని, తెలంగాణలో ఎన్ని పంటలు పండుతాయి.. ఏ విధంగా ఆ పంటలు మార్కెట్‌లోకి పోవాలనే అంశాలపై చర్చించామన్నారు. ఈ సందర్భంగా ఒక ఏడాదికి రూ.లక్ష కోట్ల విలువైన పంటలను మన రైతాంగం పండించబోతోందని తేలిందన్నారు. ఇది చాలా గర్వకారణమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మద్య విమోచనకు 15 కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది చివరినాటికి 25 మద్యం, మాదకద్రవ్య విమోచన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. వీటిలో ఉచితంగా వైద్యసాయం అందిస్తామని వెల్లడించారు. తొలి విడతగా 15 కేంద్రాలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో డిజిటల్‌ విధానంలో సీఎం జగన్‌ ప్రారంభించారు. అనంతరం మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా వీటి వివరాలు వెల్లడించారు. ‘రాష్ట్రంలో 15 ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి కేంద్రంలో 15 పడకలు ఉంటాయి. వీటి నిర్వహణకు ఏడాదికి రూ.4.98 కోట్లు వ్యయం కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అందరూ ‘రూల్‌ ఆఫ్‌ లా’ పాటించాలి

న్యాయ వ్యవస్థ బలోపేతమైతే.. ప్రజాస్వామ్యం బలోపేతమైనట్లేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ రూల్‌ ఆఫ్‌ లాను పాటించాలని ఆయన సూచించారు. ముఖ్య అతిథిగా దిల్లీ నుంచి పాల్గొన్న జస్టిస్‌ రమణ చిత్తూరులో నూతన కోర్టు భవన సముదాయ నిర్మాణానికి శుక్రవారం డిజిటల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. భూమిపూజ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జస్టిస్‌ రమణ మాట్లాడుతూ..‘కరోనా కారణంగా ప్రస్తుతం కొంత కఠిన పరిస్థితుల్లో ఉన్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ముందడుగు వేయాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆర్థికం... 11 ఏళ్ళు వెనక్కి

దేశ ఆర్థిక వృద్ధి 11 ఏళ్ల కనిష్ఠ స్థాయికి చేరింది. 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 4.2 శాతంగా నమోదైంది. 2018-19 నాటి 6.1 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత అత్యంత స్తబ్దతకు గురైంది కూడా ఇప్పుడే. వినియోగం, పెట్టుబడులు తగ్గడం ఇందుకు నేపథ్యం. నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో వృద్ధి రేటు 3.1 శాతానికి పరిమితం అయినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఫెదరర్‌ 1 కోహ్లి 66

ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల టాప్‌-100 జాబితాలో భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లికి మాత్రమే చోటు లభించింది. ఫోర్బ్స్‌ శుక్రవారం వెల్లడించిన ఈ జాబితాలో రూ. 196 కోట్ల ఆదాయంతో కోహ్లి 66వ స్థానంలో నిలిచాడు. గత ఏడాదితో పోలిస్తే అతడు 34 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. నిరుటిలానే ఈసారి కూడా కోహ్లీ తప్ప భారత్‌ నుంచి మరే అథ్లెట్‌కు ఈ జాబితాలో చోటు దక్కలేదు. మరోవైపు స్విస్‌ టెన్నిస్‌ గ్రేట్‌ రోజర్‌ ఫెదరర్‌ కెరీర్‌లోనే తొలిసారిగా రూ.801 కోట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్‌ జాబితాలో టెన్నిస్‌ ఆటగాడు అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి!  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కరోనాపై న్యూజిలాండ్‌ విజయం!

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిలువరించడంలో న్యూజిలాండ్‌ విజయం సాధించినట్లే కనిపిస్తోంది. దాదాపు 50 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో వారం రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం అక్కడ ఒకే ఒక్క క్రియాశీల (యాక్టివ్‌) కేసు ఉంది. న్యూజిలాండ్‌లో ఇప్పటివరకు కేవలం 1,504 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 22 మంది మరణించారు. 1,481 మంది కోలుకున్నారు. ప్రస్తుతానికి కొవిడ్‌ కోరల్లో నుంచి పూర్తిగా బయటపడినట్లే కనిపిస్తున్నప్పటికీ.. లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత మళ్లీ వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారించడం ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.