close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 07/06/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. ఆరో స్థానానికి భారత్‌

కరోనా కేసుల్లో భారత్‌ ఇటలీని అధిగమించి, ప్రపంచంలో ఆరో స్థానానికి ఎగబాకింది! ఇప్పటివరకూ ఎన్నడూ లేనంతగా... 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,887 కొత్త కేసులు నమోదుకాగా, 294 మంది మృతి చెందారు. ఈ రెండు అంశాల్లో ఇప్పటివరకూ ఇవే గరిష్ఠం! దేశంలో రికవరీ రేటు శుక్రవారం 48.27% ఉండగా శనివారం నాటికి అది 48.20%కి తగ్గింది. ఇదే సమయంలో మరణాల నిష్పత్తి 2.79% నుంచి 2.80%కి పెరిగింది. శనివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 2.36 లక్షలకు చేరగా, కోలుకున్నవారి సంఖ్య 1.14 లక్షలకు పెరిగింది. నాలుగు అంకెల సంఖ్యలో కేసులు వచ్చిన రాష్ట్రాలు గత నెలరోజుల్లో రెట్టింపయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మహిళల వివాహ వయస్సు పెంపు!

మహిళల కనీస వివాహ వయస్సును పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. మహిళలు ఏ వయసులో తల్లి అయితే ఆరోగ్యకరమో అన్న విషయమై అధ్యయనం చేయడానికి కార్యదళా(టాస్క్‌ఫోర్స్‌)న్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ శనివారం జారీ చేసిన పత్రికా ప్రకటన ఇందుకు ఊతమిస్తోంది. మహిళల వివాహ వయస్సు ప్రస్తుతం 18 సంవత్సరాలు కాగా, దీన్ని ఎంతకు పెంచాలనేదానిపై అధ్యయనం చేయనున్నారు. దిల్లీకి చెందిన జయా జైట్లీ అధ్యక్షురాలిగా, నజ్మా అఖ్తర్‌ (దిల్లీ), మహారాష్ట్రకు చెందిన వసుధా కామత్‌, గుజరాత్‌కు చెందిన దీప్తి షా సభ్యులుగా ఈ కార్యదళం ఏర్పాటయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పంట కొన్నరోజే రైతుకు సొమ్ము

‘రైతు నుంచి పంటను కొనుగోలు చేసిన వ్యాపారి కొన్నరోజే సొమ్ము చెల్లించాలి. చెల్లింపు ప్రక్రియ ఆలస్యమవుతుందనుకుంటే గరిష్ఠంగా మూడు పనిదినాల్లో ఇవ్వాలి. అలాంటి సందర్భంలో ఎంత చెల్లించాలో వివరాలతో రైతుకు రశీదు అందజేయాలి’’ అని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో పంటలు, పాడి, మత్స్య ఇలా వ్యవసాయ సంబంధ ఉత్పత్తులన్నింటినీ స్వేచ్ఛగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఎవరైనా అమ్ముకునేందుకు, కొనేందుకు ఈ ఆదేశాలిస్తున్నట్లు చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రూ.550కే కరోనా నిర్ధారణ కిట్‌

కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్ష కిట్‌ను రూ.550 ఖర్చుతోనే తయారు చేసినట్లు ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధక బృందం తెలిపింది. ఫలితం కూడా 20 నిమిషాల్లోనే తెలుస్తుందని వెల్లడించింది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో వీటిని ఉత్పత్తి చేస్తే రూ.350కే కిట్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని తెలిపింది. క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయిన ఈ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) నుంచి అనుమతి లభించగా, పేటెంట్‌ కోసం దరఖాస్తు చేశారు. ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆచార్యులు డాక్టర్‌ శివ్‌గోవింద్‌సింగ్‌, పరిశోధక విద్యార్థులు సూర్యస్నాత త్రిపాఠి, సుప్రజా పట్టా ఈ కిట్‌ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పది పరీక్షలు వాయిదా

తెలంగాణలో సోమవారం నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు శనివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు శనివారం స్పష్టం చేసింది. అలా చేస్తే సమస్యలు రావొచ్చని భావించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ పరీక్షలను నిర్వహించాలా? లేక అంతర్గత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వాలా అన్నది ముఖ్యమంత్రి వద్ద ఆది లేదా సోమవారం జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయానికి రానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. శబరిమల ఆలయ దర్శనానికి టోకెన్‌ పద్ధతి

కరోనా నేపథ్యంలో శబరిమల ఆలయంలో దర్శనానికి టోకెన్‌ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆలయ ప్రవేశానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. శబరిమల ఆలయంలో వర్చువల్‌ క్యూ పద్ధతి ద్వారా దర్శనానికి అనుమతి ఇస్తామని.. ఈ విధానంలో ఒకేసారి 50 మందికి వెళ్లే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. దర్శనంలో భాగంగా నీలక్కళ్‌, పంబా, సన్నిధానంలో శరీర ఉష్ణోగ్రతను కొలిచేందుకు థర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తెలుగు రాష్ట్రాల్లో ‘జియో మార్ట్‌’ సేవలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రజలు కిరాణా వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే సౌకర్యాన్ని రిలయన్స్‌ రిటైల్‌కు చెందిన ‘జియో మార్ట్‌’ అందుబాటులోకి తీసుకువచ్చింది. రెండు రాష్ట్రాల్లోని 30 పట్టణాలు/ నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ ఇక్కడ ఒక ప్రకటనలో వెల్లడించింది. వినియోగదార్లు జియోమార్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా తమకు కావసిన వస్తువులను ఆర్డర్‌ చేయవచ్చు. పళ్లు, కూరగాయలు, నూనెలు, పప్పు దినుసులు, పానీయాలు... తదితర ఎన్నో రకాలైన వస్తువులను అందుబాటులో ఉంచినట్లు, గరిష్ఠ చిల్లర ధర కంటే 5% డిస్కౌంటుకు అన్ని రకాలైన ఉత్పత్తులు అందిస్తున్నట్లు తెలియజేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆనంద్‌కు ఆనందం

భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. కరోనా వల్ల ప్రయాణ ఆంక్షలు విధించడంతో జర్మనీలో చిక్కుకుపోయిన అతను మూడు నెలల తర్వాత శనివారం తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. మే 30న స్వదేశం చేరుకున్న అతను లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు బెంగళూరులో వారం పాటు క్వారంటైన్‌లో ఉన్నాడు.    ‘‘అవును.. నేను ఇంటికి చేరుకున్నా. ఇన్ని రోజుల తర్వాత నా కుటుంబాన్ని, ముఖ్యంగా నా కొడుకును చూసినందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని ఆనంద్‌ ట్వీట్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అలా ఉంటేనే నచ్చుతా

నటిగా తెరపైకి అడుగుపెట్టామంటే.. అన్ని రకాల పాత్రలు చేసి తీరాల్సిందే అని బలంగా నమ్మే వ్యక్తిని నేను. ఈ రంగంలో నన్ను నేను నిరూపించుకోవాలంటే నటిగా నాలోని అన్ని కోణాల్ని ఆవిష్కరించాల్సిందే. అందుకే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగానే ఉంటా. కాకపోతే ఏ పాత్ర చేసినా దానికి కథలో తగినంత ప్రాధాన్యం ఉండాలి. నేనైతే వ్యక్తిగతంగా బోల్డ్‌ బ్యూటీగానే అందరికీ నచ్చుతాననిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమలోకి కొత్తగా అడుగుపెట్టే వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. విజయానికి ప్రత్యేకంగా ఓ రూట్‌ మ్యాప్‌ అంటూ ఏం ఉండదు’ అంటూ చెప్పుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఉద్యోగం కోసం ఊపిరి తీశారు

మరికొన్ని రోజుల్లో ఉద్యోగ విరమణ పొందాల్సిన తండ్రిని కుటుంబ సభ్యుల సహకారంతో కన్న కొడుకే హత్య చేసిన ఉదంతమిది. అంత్యక్రియల సమయంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించడంతో దారుణం వెలుగుచూసింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో గత నెల 26న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ వివరాల ప్రకారం..కొత్తూరు గ్రామానికి చెందిన ముత్కల నర్సయ్య(58) గోదావరిఖనిలో సింగరేణి సంస్థలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.