close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 03/07/2020 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. పడకలు కరవు

హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కొవిడ్‌ బాధితునికి పడక కావాలంటూ ఏ ఆసుపత్రిని సంప్రదించినా లేదనే సమాధానం వస్తోంది. అలాగే ప్రైవేటు ల్యాబ్‌లలో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం గగనమవుతోంది. మూణ్నాలుగు రోజుల వరకూ నమూనాలను స్వీకరించలేమనే సమాధానం వస్తోంది. పడక కావాలన్నా, పరీక్షలు చేయించుకోవాలన్నా.. అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేయించుకోవాలని ఆయా ఆసుపత్రులు, ల్యాబ్‌లు సూచిస్తుండడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. కొన్ని సందర్భాల్లో పెద్దస్థాయిలో పైరవీలు చోటుచేసుకుంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొవిడ్‌ కోరల్లో యువత!

2. కోర్టులు ప్రభుత్వాలను నడిపిస్తాయా?

‘ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాలను నడిపిస్తారా? వాటి నుంచి ప్రభుత్వ పాలన నడిచేలా ఆదేశాలు వస్తే.. ఎన్నికలెందుకు.. ప్రజలు ఎన్నుకోవడం దేనికి?’ అని శాసనసభ స్పీకరు తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. గురువారం కుటుంబ సభ్యులతో కలసి ఆయన కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. భారత రాజ్యాంగం స్పష్టమైన వ్యవస్థలను ఇచ్చి.. వాటి పరిధులను నిర్ణయించిందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. లాక్‌డౌన్‌ భయం.. సొంతూళ్లకు పయనం

కరోనా విజృంభిస్తుండటంతో తమ రక్తసంబంధీకులతో కలిసి ఉండటానికి ప్రజలు హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలివస్తున్నారు. మార్చి నాటి లాక్‌డౌన్‌ ముందు రోజుల తరహాలో కాకున్నా వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. బస్సు మార్గాల్లోని సరిహద్దుల వద్ద సందడిగా ఉంటోంది. వారిని అనుమతించే విషయంలో పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నారు. ‘‘స్పందన’’ ఈ-పాస్‌, ఆధార్‌, ఇతర గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తూ... చిరునామాలు నమోదు చేసుకుంటున్నారు. అనుమతి పత్రాలు లేని వారిని వెనక్కి పంపించేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఊరికే పోదాం.. ఉన్నదే తిందాం

4. అమ్మా నీకు పాజిటివంట..ఇంటికి రావొద్దు!

మాయదారి కరోనా... మహమ్మారి కరోనా... దాని కాఠిన్యానికి మనుషుల అనుబంధాలు అల్లకల్లోలం అవుతున్నాయి. అప్పటిదాకా అమ్మను అంటిపెట్టుకుని ఉన్న ఓ కుమారుడు... ఆమెకు పాజిటివ్‌ అని తెలియగానే వదిలేసి వెళ్లిపోయిన ఉదంతమిది. ఈ హృదయ విదారక సంఘటన గుంటూరు జిల్లా మాచర్లలో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని 29వ వార్డుకు చెందిన ఓ వృద్ధురాలు పొట్టకూటి కోసం కొన్నాళ్ల క్రితం గోవా వెళ్లారు. అక్కడే ఆపనీ ఈపనీ చేస్తూ కుమారుడికి డబ్బు పంపేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇంటింటా చమురు మంట

రోనా కాలంలో విలవిల్లాడుతున్న ప్రజలను ఇప్పుడు చమురు ధరలు మరింత దెబ్బతీస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై భారాన్ని మోపుతున్నాయి. ప్రధానంగా రవాణా ఛార్జీలు అమాంతం అధికమయ్యాయి. ఆ మోతలన్నీ అంతిమంగా ప్రజల నడ్డివిరుస్తున్నాయి. వెంటనే కూరగాయలపై ఆ ప్రభావం బాగా కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జేఈఈ, నీట్‌ నిర్వహణపై ఉత్కంఠ

జేఈఈ మెయిన్‌, నీట్‌...ముందుగా ప్రకటించిన తేదీల్లో జరుగుతాయా? వాయిదా వేస్తారా? దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల మదిని తొలుస్తున్న ప్రశ్నలివి. కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్రాల విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వినతిపత్రాలు అందాయి. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం తమకు ముఖ్యమని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ చెబుతూ వస్తున్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా వేయాలని కొందరు విన్నవిస్తుండగా... లక్షలాది మంది మాత్రం ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాలని అడుగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సెప్టెంబరు 15 నుంచి ఇంజినీరింగ్‌ విద్యాసంవత్సరం

7. ‘మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ ఇక లేరు..
మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న నృత్యదర్శకురాలు సరోజ్‌ ఖాన్‌(71) ఇక లేరు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో గత శనివారం ముంబయిలోని గురునానక్‌ ఆస్పత్రిలో చేరిన ఆమె‌ చికిత్స పొందుతూ.. శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు. 1950వ దశకంలో బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సరోజ్‌ఖాన్‌ బాలీవుడ్‌లో మంచి కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో రెండు వేలకు పైగా పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేశారు. ‘మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’గా సరోజ్‌ ఖాన్‌ ప్రసిద్ధి గాంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. శాంతిని పునరుద్ధరించాలి

 ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దులో సత్వరం శాంతి, సుహృద్భావాలు నెలకొనేలా చైనా చర్యలు చేపడుతుందని భారత్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. పరస్పర సంతృప్తికర స్థాయిలో వివాదాస్పద అంశాలన్నీ పరిష్కృతమయ్యేవరకు సైనిక, దౌత్యవర్గాల స్థాయిలో సమావేశాలు కొనసాగుతాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గురువారం విలేకరులకు తెలిపారు. ఉద్రిక్తతల్ని సడలించేలా చూసేందుకు ఉభయపక్షాలూ కట్టుబడి ఉన్న విషయాన్ని తాజా చర్చలు చెబుతున్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొన్ని కరోనా ల్యాబ్‌ల తాత్కాలిక మూసివేత

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్న పలు ప్రైవేటు ప్రయోగశాలలు గురువారం ఉన్నట్టుండి నమూనాలను స్వీకరించడాన్ని నిలిపివేశాయి. నాలుగైదు రోజుల వరకూ స్వీకరించబోమని చెబుతుండటంతో.. తీరా ల్యాబుల వరకూ వెళ్లిన కరోనా అనుమానిత లక్షణాలున్నవారు నిరాశగా వెనుదిరిగారు. హైదరాబాద్‌లో నాలుగు బ్రాంచీల నుంచి కరోనా నమూనాలను స్వీకరిస్తున్న ఒక ల్యాబొరేటరీ అయితే ఏకంగా తన అధికారిక వెబ్‌సైట్‌లోనే ‘ఈనెల 5 వరకూ నమూనాలను స్వీకరించడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రత్యేక రైళ్ల స్టాపుల కుదింపు?

కరోనా నేపథ్యంలో కొన్ని ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతున్న రైల్వేశాఖ.. ఆయా మార్గాల్లో స్టాపుల్ని తగ్గించేందుకు యోచిస్తోంది. పలు స్టేషన్లలో చాలా తక్కువ మంది ప్రయాణికులు మాత్రమే ఎక్కడం, దిగడం చేస్తున్నారు. కొన్ని స్టేషన్లలో అసలు ఎవరూ ఉండడంలేదు. ఇలాంటిచోట్ల నిర్వహణపరంగా వ్యయప్రయాసలు ఎదురవుతున్నాయని రైల్వేశాఖ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో స్టాపుల్ని కుదించేందుకు వెసులుబాటు కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.