close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/07/2020 08:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. విస్తరణ శక్తులకు ఓటమి తథ్యం

సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న పొరుగు దేశానికి గట్టి హెచ్చరిక...ప్రాదేశిక, ఆర్థిక విస్తరణ కాంక్షలతో రగిలిపోతున్న డ్రాగన్‌కు భవిష్యత్‌ దర్శనంపై ఉద్బోధ.. ప్రగతి పథంలో సాగటమే ఈ యుగ ధర్మమని హితబోధ.. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సరిహద్దుల్లోని సైనిక శిబిరాలను సందర్శించటం ద్వారా చైనాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టి సంకేతాలనే పంపించారు. విస్తరణవాద యుగానికి కాలం చెల్లిందని, అలాంటి శక్తులకు ఓటమి తప్పదని చరిత్ర ఎప్పుడో నిరూపించిందని గుర్తు చేస్తూ చురకలు వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విస్తరణవాదిగా ముద్ర వేయడం తగదు

2. సమరావతి

పచ్చదనం పరుచుకున్న నేల ప్రతిష్ఠాత్మక రాజధానిగా రూపుదిద్దుకుంటున్న వేళ వారంతా సంబరపడ్డారు. తమ త్యాగాలకు తగిన ప్రతిఫలం లభిస్తుందని గుర్తించారు. ఇంతలోనే వారి ఆశలపై మబ్బులు కమ్మాయి. మూడు రాజధానులపై ప్రభుత్వ ప్రకటన శరాఘాతమైంది. ‘అమరావతి’ ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు పోరాటమే శరణ్యమని తలచారు. వారి ఉద్యమానికి నెలలు గడిచాయి. అయినా వారిలో అదే అకుంఠిత దీక్ష. అందరి ఆశ, శ్వాస ఒక్కటే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రైల్వేలో కొలువులకు ఎర్రజెండా

ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రత(సేఫ్టీ)కు సంబంధించినవి మినహా కొత్త పోస్టుల మంజూరు, భర్తీ ప్రక్రియకు బ్రేక్‌ వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కొత్త నోటిఫికేషన్లు చేపట్టవద్దంటూ రైల్వేబోర్డు స్పష్టం చేసింది. బోర్డు జాయింట్‌ డైరెక్టర్‌ అజయ్‌జా అన్ని జోన్ల జనరల్‌ మేనేజర్లు, ప్రొడక్షన్‌ యూనిట్లకు ఈ మేరకు గురువారం రాత్రి కీలక ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ ఆదేశాలపై గందరగోళం నెలకొనడంతో శుక్రవారం రైల్వేబోర్డు డైరెక్టర్‌ జనరల్‌(హెచ్‌ఆర్‌) ఆనంద్‌ ఎస్‌ ఖాతి స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్‌!

 కరోనా మహమ్మారి నివారణకు ఆగస్టు 15లోగా టీకా తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. మనదేశం సొంతంగా ఆవిష్కరించే తొలి వ్యాక్సిన్‌ ఇదే అవుతుందని పేర్కొంది. అత్యంత కీలక ప్రాజెక్టు అయిన దీన్ని ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తోందని వివరించింది. భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న ఈ టీకా (కోవాగ్జిన్‌)పై క్లినికల్‌ పరీక్షలు చేయడానికి హైదరాబాద్‌లోని నిమ్స్‌, విశాఖపట్నంలోని కింగ్‌ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్‌) సహా దేశంలోని 12 ఆసుపత్రులను ఎంపిక చేశామని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇంత తక్కువ సమయంలో ఎలా సాధ్యం?

5. ఆన్‌లైన్‌ అయోమయమే

 పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిద్దామన్నా రాష్ట్రంలో అందుకు తగిన మౌలిక వసతులు లేవు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్‌లే కాదు...దాదాపు 40 శాతం కుటుంబాల్లో కనీసం ఒక స్మార్ట్‌ఫోన్‌ కూడా లేదు. అది ఉన్నవారికీ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేదు. ఒకవేళ ఉన్నా ఆన్‌లైన్‌ తరగతులకు అది సరిపోదు. ఒకవైపు తల్లిదండ్రులు, పిల్లల పరిస్థితి ఇలాగుంటే...మరోవైపు ఆన్‌లైన్‌ తరగతులకు  హాజరవుతున్న వారూ తమకు పాఠాలు అర్థం కావడం లేదు...వాటివల్ల ఉపయోగం నామమాత్రమని తేల్చిచెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జైడస్‌ నుంచీ ‘కొవిడ్‌-19’ టీకా!

దేశీయంగా అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా ‘జైకోవ్‌- డి’ని మనుష్యులపై ప్రయోగించేందుకు (క్లినికల్‌ ట్రయల్స్‌) డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి జైడస్‌కు అనుమతులు లభించాయి. భారత్‌ బయోటెక్‌ తర్వాత ఇటువంటి అనుమతులు పొందిన రెండో భారతీయ సంస్థ జైడస్‌ కావడం గమనార్హం. భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌’ టీకాకు కూడా మనుష్యులపై పరీక్షించేందుకు ఇప్పటికే ఔషధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో ఏడుకు పైగా వ్యాక్సిన్లు పరిశోధన దశలో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొత్తరకం కరోనాతో కంగారు

7. ఈ కష్టం ఎవరికీ రావద్దు

కరోనా వైరస్‌ ఆ కుటుంబాన్ని కుదిపేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ కుటుంబ యజమాని చనిపోయిన విషయం ఒకరోజల్లా ఆ ఇంటివాళ్లకు తెలియదు. అప్పటివరకు ఇద్దరు కొడుకులు, కోడళ్లతో కళకళలాడిన ఆ కుటుంబంలో యజమాని భార్యకు కరోనా సోకింది. దీంతో ఆమెను ఐసొలేషన్‌కు తరలించారు. కొడుకులు, కోడళ్లను క్వారంటైన్‌కు పంపారు. అప్పటికే పక్షవాతంతో బాధపడుతున్న కుటుంబ యజమాని కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోయారు. ఈనెల 2న మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు. ఈ విషయం కుటంబసభ్యులెవరికీ తెలియదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భర్త ఆచూకీ దొరికినా.. ప్రాణం లేదు

తాను దగ్గరుండి మరీ తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చిన తన భర్త ఆచూకీ చెప్పాలంటూ పది రోజులుగా ఒంటరి పోరాటం చేస్తున్న ఆ వృద్ధురాలు చివరికి విషాద వార్త వినాల్సి వచ్చింది. తన భర్త చనిపోయిన తొమ్మిది రోజుల తర్వాత ఆ వార్త ఆమెకు చేరింది. శవాగారంలోనే మృతదేహం ఉన్నా ఆచూకీ ఎవరూ చెప్పలేదు. విజయవాడలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రి సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యానికి ఇదో ప్రత్యక్ష నిదర్శనం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇక 10 రోజుల్లో డిశ్ఛార్జి

కొవిడ్‌-19 బారిన పడి.. లక్షణాలు లేనివారి సంఖ్య అధికంగా ఉండటంతో గృహ ఏకాంతవాస విధానం(హోం ఐసొలేషన్‌)లో కేంద్ర ఆరోగ్య శాఖ మార్పులు చేసింది. తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. లక్షణాల్లేని రోగులను ‘స్వల్ప లక్షణాలున్న’ లేదా ‘లక్షణాలు బయటపడక ముందు స్థాయి’ కేసుల జాబితాలో చేరుస్తారు. అయితే హెచ్‌ఐవీ, క్యాన్సర్‌ ఉన్నవారికి, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరిగిన వారికి మాత్రం హోం ఐసొలేషన్‌కు అనుమతించరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇళ్లలోనే చికిత్స

10. ఆధారాల్లేవ్‌

2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఫిక్సింగ్‌ జరిగిందంటూ ఓవైపు శ్రీలంక మాజీ క్రీడల మంత్రి ఆరోపణలు.. మరోవైపు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం.. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ప్రపంచంలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. కానీ ఈ వ్యవహారం రెండు రోజులకే చల్లబడిపోయింది. హడావుడిగా విచారణ కమిటీ వేసిన శ్రీలంక ప్రభుత్వం అంతలోనే వెనక్కి తగ్గింది. ఆ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాల్లేవంటూ విచారణను అర్ధంతరంగా ఆపేశారు లంక పోలీసులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.