close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 05/07/2020 09:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. భారత వాయుసేన సర్వ సన్నద్ధం!

తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి భారత వైమానిక దళం సిద్ధమైంది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి కీలకమైన అన్ని వైమానిక స్థావరాల్లో యుద్ధవిమానాలు, పోరాట హెలికాప్టర్లు, రవాణా విమానాల మోహరింపును భారీగా పెంచింది. డ్రాగన్‌కు దీటుగా సైనిక సన్నద్ధతను మరింత పెంచడానికి సి-17 గ్లోబ్‌మాస్టర్‌-3, సి-130జె సూపర్‌ హెర్క్యులెస్‌ రవాణా విమానాలతో భారీగా ఆయుధాలు, ఇతర సాధనాలను సరిహద్దు స్థావరాలకు మన వాయుసేన తరలిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అష్ట దిగ్బంధం

రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జూన్‌ ఒకటో తేదీతో పోల్చితే శనివారం నాటికి రోజుకి 20 రెట్లకు పైగా కేసులు వస్తున్నాయి. గత 15 రోజుల నుంచి ఈ కేసులు మరీ ఎక్కువయ్యాయి. జీహెచ్‌ఎంసీలో కొవిడ్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 80 శాతానికి పైగా  రాజధానిలో ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం 150 వరకు కొత్తగా కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా ప్రభుత్వం గుర్తించి కట్టడి చర్యలు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఉచితంగా 10 కిలోల రేషన్‌ బియ్యం

రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ ఈ నెల నుంచి నవంబరు వరకూ ఉచితంగా 10 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు. శనివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రకటించిన 5 కిలోలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కిలోలు అందించాలని నిర్ణయించిందన్నారు. సీఎం కేసీఆర్‌ సూచనలతో ఆదివారం నుంచి రేషన్‌ దుకాణాల్లో పంపిణీని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 7 నుంచి నిమ్స్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌

 భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక కరోనా వ్యాక్సిన్‌ ‘కోవాగ్జిన్‌’ని మనుషులపై ప్రయోగించడానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్లినికల్‌ పరీక్షలు చేసేందుకు హైదరాబాద్‌లోని నిమ్స్‌ సహా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రులను ఎంపిక చేయగా.. నిమ్స్‌లో ఈ నెల 7 నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ మనోహర్‌ శనివారం మీడియాతో మాట్లాడారు. గతంలో చేపట్టిన క్లినికల్‌ ప్రయోగాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మనుషులపై మొదటి దశ (ఫేజ్‌01) ప్రయోగాలకు అవకాశం ఇచ్చినట్టు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సంపూర్ణ విశ్వాసంతోనే ముందుకు

5. మోదీజీ.. జోక్యం చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేశారు. రాజధాని రైతుల పోరాటం 200 రోజులకు చేరుతున్న సందర్భంగా శనివారం ఆయన మంగళగిరి సమీపంలోని తెదేపా జాతీయ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి నిరసన దీక్ష నిర్వహించారు. రాజధాని తరలిపోతుందన్న మనో వేదనతో మృతి చెందిన రైతుల చిత్రపటాలవద్ద నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. ఆధిపత్య పోరుతోనే భాస్కరరావు హత్య

మచిలీపట్నం మార్కెట్ యార్డు కమిటీ మాజీ అధ్యక్షుడు మోకా భాస్కరరావు హత్యలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భాగస్వామి అని, అన్ని ఆధారాలు సేకరించాకే ఆయన్ను అరెస్టు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. రవీంద్ర అనుచరుడు చింతా నాంచారయ్య అలియాస్‌ చిన్నా, భాస్కరరావుల ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్య జరిగిందన్నారు. దీనంతటికీ కొల్లు రవీంద్ర పెద్దన్నలా వ్యవహరించారని ఎస్పీ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. మానవత్వానికి అపోహల మరక!

కరోనా ప్రపంచాన్నే వణికిస్తున్న అంటువ్యాధి. రాష్ట్రంలో అంతకుమించిన మరో ప్రమాదకర వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. అదే.. కొవిడ్‌తో మృతి చెందినవారికి తమ చుట్టుపక్కల శ్మశానవాటికల్లో అంత్యక్రియలు చేసే తమకూ వైరస్‌ సోకుతుందన్న అపోహ. ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. ‘‘ఆ మృతదేహాల నుంచి వేరేవారికి వైరస్‌ సోకుతుందనడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. అనవసరంగా మృతదేహాన్ని తాకవద్దని ఐసీఎంఆర్‌ ఇప్పటికే సూచించింది’’ అని హైదరాబాద్‌లోని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ కె.మిశ్రా ఇటీవల స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

అన్ని వయసుల వారినీ కాటేస్తోంది

8. టికెట్‌ చిరిగి పోయింది

కొవిడ్‌-19 ప్రభావం ప్రజా రవాణాపై అధికంగా పడింది. బస్సులు, రైళ్లు, విమానాలతో పాటు క్యాబ్‌లలో ప్రయాణానికీ పలు ఆంక్షలుండగా, అందుబాటులో ఉన్న వాటిలో వెళ్లేందుకు ప్రజలూ వెనుకాడుతున్నారు. వినోద రంగమైతే పూర్తిగా మూతబడింది. సినిమా థియేటర్ల గేట్లు మూతబడి 100 రోజులు దాటగా, సినీ-మ్యూజికల్‌ తారలు పాల్గొనే వినోద కార్యక్రమాల వంటివీ నిర్వహించే పరిస్థితి లేదు. ఈ రంగాలకు టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన సంస్థల ఆదాయం భారీగా క్షీణించింది. ఫలితంగా ఉద్యోగుల తొలగింపు, మిగిలిన వారికి వేతనాల్లో భారీ కోత విధిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​​​​​​​​

9. కొవిడ్‌ టీకా ఈ ఏడాది సాధ్యం కాదు

 కొవిడ్‌-19కు వచ్చే ఏడాది ఆరంభంలోగా టీకా సిద్ధమయ్యే అవకాశం లేదని స్థానిక ‘సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ’ (సీసీఎంబీ) డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్ర చెప్పారు. ఈ మహమ్మారికి ప్రపంచంలోనే తొలి టీకాను వచ్చే నెల 15 కల్లా ఆవిష్కరించాలనుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సంబంధిత ఆసుపత్రులకు లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్లినికల్‌ పరీక్షల నిర్వహణ విషయంలో సంబంధిత ఆసుపత్రులపై ఒత్తిడి తీసుకురావడానికే ఐసీఎంఆర్‌ దాన్ని రాసి ఉంటుందని తెలిపారు. అంతా అనుకున్నట్లే జరిగితే టీకా సిద్ధం కావడానికి 6-8 నెలల సమయం పడుతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

కరోనా యోధులకు యాంటీబాడీ పరీక్షలు

10. అలా చేస్తే నాకు అవకాశాలు లేవనుకుంటారు

చిరంజీవి అల్లుడిగా ‘విజేత’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయయ్యారు కల్యాణ్‌ దేవ్‌.  ఇప్పుడు ‘సూపర్‌ మచ్చి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పులివాసు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తయింది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు కల్యాణ్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.