టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM
close

తాజా వార్తలు

Published : 12/07/2020 09:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. కొలువు కావాలి

కరోనా వేల మంది ఉపాధిని ఊడ్చేసింది. ప్రధానంగా వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడంతో ఉపాధి అవకాశాలు దూరమయ్యాయి. చిన్నచిన్న కొలువుల్లోనూ కోతలు మొదలయ్యాయి. దీంతో పనుల్లేక చాలా మంది ఇంటికే పరిమితమవుతున్నారు. ఇది కుటుంబపోషణపై ప్రభావం చూపుతుండగా.. సమస్యలు పెరిగి నిరుద్యోగుల జీవితాలు దయనీయంగా మారాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కాలంలో ఉద్యోగార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హతవిధీ... కరోనా తెచ్చిన కష్టమిది!

అంతిమ సంస్కారం అనే మాటనే ఇప్పుడు వాడలేని పరిస్థితి ఏర్పడింది. ‘ఆస్తిపాస్తులు కావు వెంట వచ్చేది ఆ నలుగురే’ అన్న మాటకూ అర్థం మారిపోతోంది. తమ వారెవరో, ఎక్కడున్నారో, కనీసం ఏ చితిపై కాలుతున్నారో గుర్తించలేని దయనీయ స్థితి నెలకొంది.
ఒక్కరై రావడం, ఒక్కరై పోవడం.. అన్నట్లుగా కరోనా మరణాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇన్నాళ్లూ తమ కుటుంబంలో ఒకరై, మంచి చెడులకు, ఎదుగుదలకు బాధ్యులైన వారు విధివశాత్తూ అసువులు బాస్తే కడచూపు కోసం తపించని వారుండరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రకాశం జిల్లాలో 27వేల నమూనాల వృథా

3. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఒకే పరీక్ష?

 కరోనా మహమ్మారి పంజా విసురుతున్నా ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఏదో విధంగా జరపాలని భావిస్తున్న ఐఐటీలు.. రెండు పరీక్షలకు బదులు ఒకే పరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నాయి. కరోనా కారణంగా భౌతిక దూరం పాటించాల్సి ఉండటంతో విద్యార్థులు రోజంతా ఒకే చోట ఉండకుండా సమయాన్ని కుదించే దిశగా చర్యలు చేపట్టాయి. ఇప్పటికే అడ్వాన్స్‌డ్‌ పరీక్షను రెండు సార్లు వాయిదా వేసిన కేంద్రం.. వచ్చే సెప్టెంబరు 27న పరీక్ష జరపాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

4. సున్నా వడ్డీకి ఏదీ అండ?

ఏడాదిలోగా పంట రుణాలు చెల్లించే రైతులకు సున్నా వడ్డీ ప్రయోజనాలను వర్తింపజేయడంలో అధిక శాతం వాణిజ్య బ్యాంకులు మోకాలడ్డుతున్నాయి. కేంద్రం ఇచ్చే 5% వడ్డీ రాయితీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని రైతుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. సహకార బ్యాంకులు మాత్రం రుణం చెల్లించే సమయంలో సున్నా వడ్డీ వర్తింపజేసి (2018-19 వరకు) తర్వాత ప్రభుత్వం నుంచి తీసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే అయిదేళ్ల బకాయిల కింద ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రూ.1,053 కోట్లలోనూ 40% వాటా ఈ బ్యాంకుల పరిధిలోని రైతులకే చేరనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

5. మొలాసెస్‌ కోసం కట్టారు.. స్టైరీన్‌కు వాడారు!

‘‘మొలాసెస్‌ నిల్వ కోసం కట్టిన ట్యాంకును స్టైరీన్‌ నిల్వకు వినియోగించారు. అందుకు అవసరమైన మార్పులు చేపట్టలేదు. ట్యాంకు కట్టి 53 ఏళ్లు దాటినందున.. దీన్ని వినియోగించొచ్చా.. లేదా? అనే అంశంపై ‘మెకానికల్‌ ఇంటెగ్రిటీ అసెస్‌మెంట్‌’ చేయించలేదు. ‘జీవితకాల పరిమితి పొడిగింపు’ చర్యలు చేపట్టకుండానే 1967లో కట్టిన ట్యాంకునే స్టైరీన్‌ నిల్వలకు ఎల్‌జీ పరిశ్రమ వినియోగించింది. ఈ ప్రమాదకర రసాయనాన్ని అంత పురాతన ట్యాంకులో నిల్వ చేయటం శ్రేయస్కరం కాదు’’ అని విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనపై విచారించిన ఉన్నతస్థాయి కమిటీ ఆక్షేపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. మలేరియాను తరిమేసిన చెట్టు

ప్రస్తుతం కరోనా వైరస్‌కి మందు లేదు కదా! ఒకప్పుడు మలేరియాకి కూడా ఔషధం లేదు. దానివల్ల ఎంతో మంది చనిపోయారు. శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి ఆఖరుకి ఒక చెట్టు నుంచి ఔషధాన్ని తయారు చేశారు. అది విజయవంతంగా పనిచేసింది. అందుకని ఇప్పుడు దీన్నుంచి కరోనా వైరస్‌కి ఔషధం తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. ఔరా నల్లమల.. వన్యప్రాణులు భళా!

వర్షాకాలం ఆరంభంతో నల్లమల అంతా కొత్త అందాలను సంతరించుకొంది. పచ్చదనంతో ఉట్టిపడుతోంది. నల్లమల పేరు వినగానే పెద్దపులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు గుర్తుకొస్తాయి. వీటితో పాటు వివిధ రకాల మాంసాహార, శాకాహార జంతువులూ ఈ అడవిలో ఉన్నాయి. వన్యప్రాణులకు పుట్టినిల్లైన ఈ ప్రాంతంలో వివిధ రకాలైన జంతువులు, ఇతర జీవులు ఆహారం కోసం వెతుక్కుంటూ ప్రస్తుతం అడవిలో సంచరిస్తున్నాయి. కొన్ని ప్రాణులు రాత్రి పూట, మరికొన్ని జీవులు పగటి వేళలో ఆహారం కోసం బయటకొస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. ప్రలోభాలకు రాజ‘స్థానం’

రాజస్థాన్‌లో రాజకీయ కలకలం మొదలైంది. తనను పీఠం నుంచి దించేందుకు కమలనాథులు ప్రలోభాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఆరోపించారు. ఇవి పూర్తిగా కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలేనని, తమ తప్పేమీ లేదని కమలనాథులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాలు వాతావరణాన్ని మరోసారి వేడెక్కించాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై వాంగ్మూలాలు ఇచ్చేందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి గహ్లోత్‌, ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌లకు పోలీసులు నోటీసులు జారీచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. పిల్లల ప్రేమ.. పెద్దల మారణహోమం

పెద్దలకు నచ్చని పిల్లల ప్రేమ ఓ కుటుంబానికి మరణ శాసనం రాసింది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు  జిల్లా సింధనూరులోని సుక్కాలపేటలో శనివారం ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దారుణ హత్యకు గురయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన ప్రకారం... స్థానికంగా ఒకే వీధిలో ఉంటున్న ఈరప్ప కొడుకు, ఫకీరప్పల కూతురు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వీరి వ్యవహారంపై ఇరుకుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. అమితాబ్‌, అభిషేక్‌లకు కరోనా పాజిటివ్‌

బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, ఆయన తనయుడైన కథానాయకుడు అభిషేక్‌ బచ్చన్‌లు కరోనా బారినపడ్డారు. ‘నాకు కొవిడ్‌-19 పాజిటివ్‌ అని బయటపడింది. దీంతో ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు, నా సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకున్నారు. వారి ఫలితాలు రావాల్సి ఉంది. గత 10 రోజులుగా నా దగ్గరకు వచ్చినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ బిగ్‌బీ శనివారం రాత్రి తొలుత ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని