close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 02/08/2020 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఉన్నట్టుండి ఉత్పాతం

ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశంలో అందులోనూ తెలంగాణలో కొవిడ్‌ బారినపడి కోలుకునే వారి శాతం చాలా మెరుగ్గా ఉంది. మృతుల శాతమూ తక్కువగానే ఉంది. అయినా కొంతమందిలో అవగాహన లేకపోవడం వల్ల.. సరైన సమయంలో ముప్పు లక్షణాలను గుర్తించలేకపోతున్నారు. దురదృష్టవశాత్తు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.. కొందరు ప్రాణాలూ కోల్పోతున్నారు. అయితే ఇలాంటి కేసులు చాలా స్వల్పసంఖ్యలో ఎదురవుతున్నాయి. వీటిని కూడా తగ్గించాలంటే.. మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. కొందరు తమలో ‘స్వల్ప లక్షణాలే ఉన్నాయి కదా’ని ఏమరుపాటుగా ఉంటుండటంతో.. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రామ మందిరం వెయ్యేళ్లు పదిలం

అబ్బురపరిచే ఆకృతిలో నిర్మించనున్న అయోధ్య రామ మందిరం నాణ్యతలోనూ దానికదే సాటిగా నిలవనుంది. ఎంతలా అంటే వెయ్యేళ్లయినా ఆలయం చెక్కుచెదరదని నిపుణులు చెబుతున్నారు. భూకంపం సంభవించినా.. రిక్టర్‌స్కేల్‌పై 10 తీవ్రత నమోదైనా ఆలయానికి ఏమీకాని విధంగా ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌, చంద్రకాంత్‌ సోమ్‌పుర డిజైన్‌ చేశారు. ప్రధాన ఆలయాన్ని రెండెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. మిగతా స్థలంలో అనేక రకాల చెట్లు పెంచడంతో పాటు.. మ్యూజియమ్‌, ఆలయానికి సంబంధించిన భవనాలను నిర్మిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘ఆసుపత్రుల అమానుషం’పై కొరడా

కరోనా మహమ్మారిపై నెలకొన్న భయాన్ని సొమ్ము చేసుకునేందుకు అమానుషంగా వ్యవహరిస్తున్న కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులపై కఠిన చర్యలకు వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతోంది. అధిక ఫీజులు వసూలు చేస్తూ, మృతదేహాల అప్పగింతలో అమానవీయంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రులకు కరోనా చికిత్సల అనుమతుల్ని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అలాంటి ఫిర్యాదులొస్తున్న ఆసుపత్రులపై ఆకస్మిక దాడులు చేసి రికార్డులు పరిశీలించిన అనంతరం ఓ నిర్ణయానికి రానుంది. ఈ మేరకు బృందాలను సిద్ధం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అమరావతి భవిష్యత్తేంటి?

రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి ప్రభుత్వం నుంచి ఇదమిత్థంగా సమాధానం లేదు. శాసన రాజధానిగా ఉంటుందని మాత్రమే చెబుతోంది. కేవలం శాసనసభ సమావేశాలకు వేదిక అయితే.. ఏడాదిలో గరిష్ఠంగా 50-60 రోజులపాటు అధికారిక కార్యకలాపాలుంటాయి. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటించి పనులను పరిశీలించారు. వాటి భవిష్యతేంటి? వాటిని ఏం చేయబోతున్నారో సూచనప్రాయంగానైనా చెప్పలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సీఆర్‌డీఏని రద్దు చేస్తూ... 4 రహస్య ఉత్తర్వులు

5. కొత్త, పాత తరాల మధ్య.. సంప్రదింపులు ఎంతో ముఖ్యం

కుటుంబ వ్యాపార సంస్థల్లో కొత్త తరానికి, పాత తరానికి మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతూ ఉండాలని డాక్టర్‌ రాస్‌ ఎలెన్‌హార్న్‌ అభిప్రాయపడ్డారు. యువతరానికి తమ మీద తమకు నమ్మకం అధికమని, వారు ఎంతో ఆశావహులని పేర్కొన్నారు. అందువల్ల నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు వినూత్నమైన పద్ధతిలో ముందుకు సాగుతారని విశ్లేషించారు. జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌కు చెందిన విద్యా పరిశోధన సేవల సంస్థ ‘పరంపర ఫ్యామిలీ బిజినెస్‌ ఇనిస్టిట్యూట్‌ (పీఎఫ్‌బీఐ)’ కుటుంబ వ్యాపార సంస్థలపై నిర్వహిస్తున్న వెబినార్‌ సిరీస్‌లో భాగంగా శనివారం ‘‘మనం ఎలా మారతాం- కుటుంబ వ్యాపార మూలసూత్రాలు’’ అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. అగ్రదేశాల్లో విద్యాబోధన మాతృభాషలోనే

కొత్త విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫలితంగా అవి ముందడుగు వేస్తాయని చెప్పారు. ‘‘ఇప్పటివరకూ మన స్థానిక భాషలను వాటి మానాన వాటిని వదిలేశాం. వాటిని కాపాడి, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం పెద్దగా చేయలేదు. ఇప్పుడు కొత్త విద్యా విధానంతో దక్కిన ప్రాముఖ్యత వల్ల అవి వికసిస్తాయి. ఇవి భారతీయ విజ్ఞానంతో పాటు ఏకత్వాన్నీ బలోపేతం చేస్తాయి’’ అని తెలిపారు. శనివారం దేశవ్యాప్తంగా జరిగిన ‘హ్యాకథాన్‌ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. విశాఖ తీరంలో మృత్యుఘోష

విశాఖ సాగరతీరంలో మరోసారి మృత్యుఘోష. అనుకోని ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో భారీ జెట్టీ క్రేన్‌ శనివారం 11.45 సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి ముక్కలైంది. మూడేళ్ల క్రితమే ఇది ముంబయి నుంచి వచ్చినా.. వివిధ కారణాలతో వినియోగంలోకి తీసుకురాలేదు. శనివారం ట్రయల్‌ రన్‌ చేపట్టారు. రైలుపట్టాల్లా ఉండే ట్రాక్‌పై ఆ జెట్టీ క్రేన్‌ను ముందుకు, వెనక్కి నడపడంతో పాటు బరువు మోసే సామర్థ్యాన్ని పరీక్షించసాగారు. ‘లోడ్‌ టెస్టింగ్‌’ అనే ఈ ప్రక్రియను పది మంది నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. గర్భగుడిలో ఎలుగుబంటి!

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామ సమీపంలో ఉన్న పోచమ్మ ఆలయం గర్భగుడిలోకి శుక్రవారం రాత్రి ఓ ఎలుగుబంటి కొబ్బరి కుడుకల కోసం చొరబడింది. గుడి వద్ద పడుకున్న ఓ రైతు గమనించి ద్వారానికి గొళ్ల్లెం పెట్టి తాళం వేశాడు. అటవీ అధికారుల సమాచారంతో శనివారం సాయంత్రం రెస్క్యూ బృందం చేరుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. ఏం చేద్దాం.. ఎలా చేద్దాం!

దేశంలో కరోనా విలయం కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌ను యూఏఈ  వేదికగా సెప్టెంబరు ద్వితీయార్ధం నుంచి నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన బీసీసీఐ.. దీనిపై పూర్తి స్థాయిలో విధివిధానాలు రూపొందించేందుకు ఆదివారం కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ కూడా పాల్గొంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

ఐపీఎల్‌ ఆదాయమే దేశవాళీ క్రికెట్‌కు ఆధారం

10. ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాం

కష్టం వస్తుంది... కన్నీళ్లు కారిపోతుంటాయి అప్పుడే ‘మామా... నేనున్నా’ అంటూ ఓ చేయి భుజంపై పడుతుంది. కొండంత అండలా భుజాన్ని తాకిన ఆ చేయి పేరే... స్నేహం. కష్టాన్నైనా, కన్నీళ్లయినా వన్‌ బై టు ఛాయ్‌లాగా పంచుకునేవాడే స్నేహితుడు. ఓటమి ఎదురైనా సరే... ‘ఏం పర్లేదు, నువ్వు సాధిస్తావు’ అంటూ వెన్నుతట్టి వెనక నిలిచేవాడు స్నేహితుడు. అలాంటి స్నేహాలు నా జీవితంలోనూ ఉన్నాయంటున్నాడు యువ కథానాయకుడు సాయి తేజ్‌. ఆదివారం స్నేహితుల దినోత్సవం. ఈ సందర్భంగా తేజ్‌ని ‘ఈనాడు సినిమా’ పలకరించింది. ఆయన చెప్పిన విశేషాలివీ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.