close

తాజా వార్తలు

Published : 04/08/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. డెక్కన్‌ ఆసుపత్రిపై సర్కారు కొరడా

కరోనా చికిత్సలో లోపాలకు గాను ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. సోమాజిగూడ డెక్కన్‌ ఆసుపత్రికి కరోనా చికిత్సల కోసం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేయకపోవడంతోపాటు రోగుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో...హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విచారించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కుటుంబాలు కుదేలు

‘ఆయన పేరు శ్రీనివాసరావు, ఆమె పేరు జ్యోతి (పేర్లు మార్చాం). వారికో పాప. ఖమ్మం పట్టణంలో నివాసం. రెండేళ్ల క్రితం రుణం తీసుకుని ఆటో కొలుగోలు చేశారు. మార్చికి ముందు.. రోజూ రూ.700 వరకు ఆదాయం వస్తుండేది. దానితో జీవితం హాయిగా గడిచిపోయేది. కరోనా ప్రభావంతో పరిస్థితి తలకిందులైంది. నాలుగు రోజుల క్రితం.. ఇక జీవితం ముగించాలనుకునే దీన స్థితికి వారు రాగా.. బంధువులు ధైర్యం చెప్పి ఆ ఆలోచనను విరపింపజేశారు.  రూ.7 వేలు కిస్తీ, ఇంటి అద్దె రూ.2500, పాపకు రూ.2 వేలు, ఇతర ఖర్చులు రూ.3 వేలతో కలిపి రూ.14,500 ప్రతి నెలా వారికి అవసరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కిమ్మనకుండా.. జిమ్‌!

వ్యాయామశాలలు, యోగా కేంద్రాల్లో అరవడం, గట్టిగా నవ్వడం వంటివాటిని పరిహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో మూతపడ్డ వ్యాయామశాలలు, యోగా కేంద్రాలను కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ నెల 5వ తేదీ నుంచి తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసింది. వ్యాయామశాలలు, యోగా కేంద్రాల్లో ప్రతి మనిషికీ 4 చదరపు మీటర్ల స్థలం కేటాయించాలని స్పష్టంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

4. రేపే ముహూర్తం

అయోధ్య రామ మందిర భూమి పూజకు ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 5న ప్రధాని మోదీ.. ప్రముఖ సాధువులు, ఇతర ఆధ్యాత్మిక వేత్తల సమక్షంలో రామాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. 22.6 కిలోల వెండి ఇటుకతో ఆయన పునాది రాయి వేయనున్నారు. భూమి పూజ కోసం, ఆలయ నిర్మాణంలో ఉపయోగించేందుకు దేశ వ్యాప్తంగా వివిధ పుణ్యక్షేత్రాల నుంచి భక్తులు మట్టిని, నదుల నుంచి పవిత్ర జలాలను పంపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

ముహూర్తం మంచిది కాదు: దిగ్విజయ్‌

5. ఏపీ అసెంబ్లీ రద్దుకు చంద్రబాబు సవాల్‌

మూడు రాజధానుల నిర్ణయం సరైనదని భావిస్తే, దానికి ప్రజామోదం ఉందనుకుంటే అసెంబ్లీని రద్దు చేయండి.. అందరం కలిసి ఎన్నికలకు వెళ్దాం.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.. అని సీఎం జగన్‌కు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సవాల్‌ విసిరారు. ‘ప్రజలు మళ్లీ మిమ్మల్నే గెలిపిస్తే.. మేం మాట్లాడటం ఆపేస్తాం.. వారి నిర్ణయాన్ని శిరసావహిస్తాం. ఏ విషయమూ 48 గంటల్లో చెప్పండి’ అని డిమాండు చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సోమవారం సాయంత్రం చంద్రబాబు వీడియో సమావేశం ద్వారా విలేకరులతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. విప్లవ కవి వంగపండు కన్నుమూత​​​​​​​

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.  మూడు దశాబ్దాల పాటు 300కు పైగా జానపదపాటలు రచించిన వంగపండు.. పేద ప్రజలు, గిరిజనులను ఎంతో చైతన్య పరిచారు. విప్లవ కవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందారు. 1943లో పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’ సినిమాతో సినీప్రస్థానం ప్రారంభించారు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ పాటతో ఉర్రూతలూగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. చిన్నారుల అశ్లీల చిత్రాల్లో 12 శాతం భారత్‌ నుంచే

భారత్‌లో చిన్నారులపై నేరాలు, హింస కేసులు పెరుగుతున్నాయని యునిసెఫ్‌ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల అశ్లీల చిత్రాల్లో 12 శాతం భారత్‌ నుంచే ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిరోజూ 25వేలకు పైగా ఇలాంటి చిత్రాలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రాల బాధితుల్లో 80 శాతం బాలికలేనని తెలిపింది. ‘దేశంలో చిన్నారులపై నేరాల నిర్మూలన’ అంశంపై అధ్యయన నివేదికను యునిసెఫ్‌ తాజాగా విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. ట్రాక్టర్‌తో తొక్కించి గిరిజన మహిళ దారుణ హత్య

అప్పు చెల్లించలేదని గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడో దుర్మార్గుడు.  భూమి తనఖా పెట్టి అప్పు తీసుకోవడమే ఆమె పాలిట శాపమైంది. హృదయ విదారకమైన ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా శివాపురం తండాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నకరికల్లు శివారు శివాపురం తండాకు చెందిన రమావత్‌ మంత్య్రానాయక్‌, మంత్రుభాయి (55) దంపతులు అటవీ భూములను సాగు చేసుకుంటూ వాటిపై హక్కులు సాధించారు రెండున్నర ఎకరాల్లో పంటలు పండిస్తూ జీవిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. మళ్లీ వావ్‌ అనిపిస్తా...

‘వావ్‌’...  ఈటీవీలో ప్రసారమైన  ‘వావ్‌’ మొదటి సీజన్‌లో 165ఎపిసోడ్లు చూసిన తెలుగు ప్రేక్షకులు ఆనందంతో అన్న మాట ఇది. ఆ తర్వాత.. రెండో సీజన్‌ ప్రారంభం...మరో 52 ఎపిసోడ్లు...మళ్లీ.. ఇన్నాళ్ల తర్వాత... డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ మరోసారి...‘వావ్‌ - 3’తో వినోదాల వర్షం కురిపించనున్నారు. మిరుమిట్లు గొలిపే సెట్‌లో- మైమరపించే రౌండ్లతో-నలుగురు సెలబ్రిటీ గెస్ట్‌లతో కలిసి ‘వావ్‌’ అనిపించబోతున్నారు. ఈరోజు నుంచి ప్రతి మంగళవారం రాత్రి 9.30 గంటలకు వావ్‌ మూడోసీజన్‌ ఈటీవీలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా సాయికుమార్‌ ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. రొనాల్డో కొత్త కారు.. రూ.75 కోట్లే!

పోర్చుగల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బుగాటి లా వాచ్యూర్‌ ఎన్వైర్‌ కారును కొనుక్కున్నాడు. ఇటీవల సిరీస్‌ ఎ ఛాంపియన్‌షిప్‌లో ఇటలీ దిగ్గజ క్లబ్‌ జువెంటస్‌ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన రొనాల్డో.. 8.5 మిలియన్‌ యూరోలు (సుమారు రూ.75 కోట్లు)తో ఈ కారును కొనుగోలు చేశాడు. కారు కొన్న విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా రొనాల్డో అభిమానులతో పంచుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.