close

తాజా వార్తలు

Published : 07/08/2020 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. కరోనాపై కాసులవేట

‘బిల్లు ఎంత వేస్తే అంతా కట్టాల్సిందే. రశీదు మాత్రం మేమిచ్చిందే తీసుకోవాలి’. కొవిడ్‌ కష్టకాలంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు అనుసరిస్తున్న తీరిది. అడ్డగోలుగా బిల్లులు వసూలు చేయడమే కాకుండా, చెల్లించిన సొమ్ముకు కాగిత రూపంలో ఆధారాలు ఇవ్వకుండా బాధిత కుటుంబాలను కొన్ని ‘కాసుపత్రులు’ ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే ఆసుపత్రి సిబ్బంది భౌతిక దాడులకు దిగుతున్నారు. అడ్డగోలు బిల్లులపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం, సర్కారు చర్యలకు ఉపక్రమిస్తుండటంతో కొన్ని ప్రైవేటు దవాఖానాలు ఈ కొత్త దందాకు తెరతీశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అందరికీ కరోనా టీకా
కరోనా నివారణ టీకా త్వరలోనే విడుదలవుతున్నందున కేంద్రం వెంటనే సేకరణ విధానంపై నిర్ణయం తీసుకోవాలని, అందరికీ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కోరారు. ఈ మేరకు గురువారం కేటీఆర్‌ ఓ లేఖ రాశారు. హైదరాబాద్‌కు చెందిన మూడు కంపెనీలు కరోనా టీకా తయారీకి ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
3. ప్లాస్మాతో కొవిడ్‌ మరణాలు తగ్గడం లేదు
కాన్వలసెంట్‌ ప్లాస్మా చికిత్స వల్ల కొవిడ్‌-19 రోగుల్లో మరణాల ముప్పు తగ్గలేదని ఎయిమ్స్‌ అధ్యయనంలో వెల్లడైంది. బాధితుల ఆరోగ్య పరిస్థితి కూడా పెద్దగా మెరుగుపడలేదని తేలింది. ప్లాస్మా చికిత్సపై ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనానికి సంబంధించిన మధ్యంతర విశ్లేషణ ఈ మేరకు పేర్కొంది. ‘నేషనల్‌ క్లినికల్‌ గ్రాండ్‌ రౌండ్స్‌ ఆన్‌ కొవిడ్‌-19’ పేరిట జరిగిన వర్చువల్‌ సదస్సులో.. ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి కరోనా బాధితుల్లో ప్లాస్మా చికిత్స ప్రయోజనం అంశంపై నిపుణులు చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘చైనా అతిక్రమణల’పై రక్షణ శాఖ తడబాటు!

 లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో చైనా అతిక్రమణలకు పాల్పడినట్లు అంగీకరిస్తూ ఒక అధికారిక పత్రం రక్షణ శాఖ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. దీనిపై వార్తలు రావడంతో రక్షణ శాఖకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ పత్రాన్ని వెంటనే వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శించింది. రక్షణ శాఖ ఈ పత్రాన్ని మంగళవారం తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ‘జూన్‌ 2020లో రక్షణ శాఖ చేపట్టిన కార్యక్రమాలు’ పేరిట రూపొందించిన ఈ పత్రంలో భారత్‌, చైనా సైన్యాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని ప్రస్తావించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన!

నిర్భయ ఘటనను గుర్తుకు తెచ్చే మరో ఘోరమైన అత్యాచార ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికపై ఓ దుండగుడు అత్యాచారం చేసి.. ఆ తర్వాత తల, ముఖం, మర్మాంగాల్ని తీవ్రంగా గాయపరిచాడు. పేగుల్లోనూ గాయాలయ్యాయి. బాలిక తల్లిదండ్రులు కూలిపనికి వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ చిన్నారి చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని దిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. పశ్చిమ దిల్లీలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘోరంపై మహిళా సంఘాలు, పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
5. ప్రజాధనం వృథా అవుతుంటే చూస్తూ ఉండలేం
రాజధాని నిర్మాణం కోసం ఎంతో ఖర్చు చేసి మధ్యలో వదిలేస్తే అది ప్రభుత్వానికి జరిగే నష్టం కాదని, ప్రజాధనానికి జరిగిన నష్టమని హైకోర్టు పేర్కొంది. భవన నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయి జనండబ్బు దుర్వినియోగం అవుతుంటే చూస్తూ ఉండలేమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఖజానాకు అయ్యే నష్టానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించింది. రాజధానిపై నిపుణుల కమిటీ, ఇతర కమిటీలు ఇచ్చిన నివేదికలు, పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల్ని సవాలు చేస్తూ గతంలో దాఖలైన పలు వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రాజధానిని నిర్ణయించుకునేది రాష్ట్రమే

7. అణ్వస్త్ర దాడిని తలపించిన  విధ్వంసం

అణు బాంబే పేలిందా అన్నంతగా విధ్వంసం.. భూకంపం వచ్చిందా అన్నట్లుగా కుప్పకూలిన నిర్మాణాలు.. సముద్రుడు ఆగ్రహించి నగరాన్ని మింగేయబోయాడా అనుకునేంతగా ఎగిసిపడ్డ అలలు.. మునిగిపోయిన నౌకలు.. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో మంగళవారం చోటుచేసుకున్న పేలుడుతో చోటుచేసుకున్న బీభత్సమిది. నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాలు, విరిగిన తలుపులు, పగిలిపోయిన అద్దాలు, రోడ్ల నిండా గాజు ముక్కలే దర్శనమిస్తున్నాయి. తాజా దుర్ఘటన దెబ్బకు బీరుట్‌లో దాదాపుగా మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రేట్లు తగ్గించలేదు కానీ..

ఆర్‌బీఐ ఈ సారి కీలక రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ.. కరోనా నేపథ్యంలో పలు ఉపశమన చర్యలు చేపట్టింది. ఈ మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్న వ్యక్తులు, కార్పొరేట్‌ సంస్థల రుణ పునర్నిర్మాణానికి అవకాశం కల్పించింది. గృహ రుణాలు, వ్యవసాయ రుణాలు పెరిగేందుకు దోహదం చేసేలా నాబార్డ్‌, ఎన్‌హెచ్‌బీలకు భారీ రుణ సదుపాయాన్ని కల్పించింది. బంగారంపై మరింత రుణం వచ్చేలా పరిమితిని పెంచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వివోతో కటీఫ్‌

చైనా మొబైల్‌ కంపెనీతో ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని బీసీసీఐ ఈ ఏడాదికి సస్పెండ్‌ చేసింది. భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వివోతో ఒప్పందాన్ని కొనసాగించాలని మొదట నిర్ణయించినా.. సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో బోర్డుకు వివోను దూరం పెట్టక తప్పలేదు. 2020 టోర్నీకి వివోతో భాగస్వామ్యం ఉండదని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. థ్రిల్లింత.. మరింత

స్పైథ్రిల్లర్‌.. క్రైమ్‌ థ్రిల్లర్‌.. సైకో హారర్‌ థ్రిల్లర్‌... ఇలా ఏ రకమైన థ్రిల్లర్‌ చిత్రాలు చూడాలన్నా కొన్నాళ్ల క్రితం వరకు హాలీవుడ్‌ వైపే చూసేవారు. కానీ కొంత కాలంగా భారతీయ చిత్రసీమలోనూ మార్పులొచ్చాయి. ఇక్కడి ప్రాంతీయ భాషల్లోనూ థ్రిల్లర్‌ చిత్రాలు విరివిగా తెరకెక్కుతున్నాయి. దీనికి తెలుగు చిత్ర పరిశ్రమ కూడా మినహాయింపు కాదు. ఇప్పుడీ జోనర్‌ తెలుగు తెరపై నయా హిట్‌ ఫార్ములాగా వెలుగొందుతోంది. అందుకే మరిన్ని వైవిధ్యభరిత థ్రిల్లర్‌ కథాంశాలను ప్రేక్షకులకు రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు టాలీవుడ్‌ దర్శక నిర్మాతలు. ఇప్పుడిలా తెరపైకి రాబోతున్న చిత్రాల్లో ఎక్కువ శాతం సీక్వెల్‌ కథలే ఉన్నాయి. మరి ఆ చిత్రాలు, వాటి విశేషాలివీ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.