close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. బీటెక్‌లో చేరాలంటే కెమిస్ట్రీ తప్పనిసరి కాదు!

బీటెక్‌లో చేరాలంటే ఇంటర్‌మీడియట్‌ లేదా 12వ తరగతిలో కెమిస్ట్రీ సబ్జెక్టు చదవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఈ దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు ఇంజినీరింగ్‌కు గణితం, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ సబ్జెక్టులను ఇంటర్‌లో చదివిన వారే అర్హులు. ఆ మూడు సబ్జెక్టుల నుంచి కెమిస్ట్రీని తొలగించాలని ఏఐసీటీఈ భావిస్తోంది. దానికి బదులు జీవశాస్త్రం, బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ గ్రాఫిక్స్‌, బిజినెస్‌ స్టడీస్‌ తదితర సబ్జెక్టులను పూర్తి చేసినా చాలని భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నేటి నుంచే 1.30 కోట్ల కొత్త బియ్యం కార్డుల పంపిణీ

ఏపీలో కొత్త బియ్యం కార్డుల పంపిణీ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల కుటుంబాలకు కార్డుల్ని అందిస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ తెలిపారు. విద్యుత్తు బిల్లులు, ఇతర సమస్యల కారణంగా అనర్హత పొందిన 8 లక్షల కుటుంబాలకు చెందిన కార్డులను పునః పరిశీలిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే 7.5 లక్షల కుటుంబాలను అనర్హులుగా గుర్తించామని చెప్పారు. 1.5 లక్షల కార్డులకు సంబంధించి చిరునామా అందుబాటులో లేకపోవడంతో రెండోసారి సామాజిక తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సువర్ణాక్షరాలతో లిఖించాడు!

ప్రధాని మోదీని ప్రశంసిస్తూ నిజామాబాద్‌ జిల్లా గుమ్మిర్యాలకు చెందిన స్వర్ణకారుడు, సూక్ష్మకళాకారుడు రామోజు మారుతి బియ్యపు గింజపై 78 స్వర్ణాక్షరాలను పొందుపరిచారు. ఈ గింజను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుక్రవారం రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. 46 రోజులపాటు శ్రమించి బియ్యపు గింజపై 10 మిల్లీగ్రాముల బంగారంతో 2 మిల్లీమీటర్ల వెడల్పు, 8 మిల్లీమీటర్ల పొడవుతో అక్షరాలను అమర్చానని మారుతి తెలిపారు. ప్రధానిని కలిసి ఈ బియ్యపు గింజను అందజేయాలనే ఆకాంక్షను వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బోల్ట్‌ను తలపించేలా..!

కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ఐకళ ప్రాంతంలో ఈ నెల 1న నిర్వహించిన కంబళ పోటీలో వంద మీటర్ల దూరాన్ని శ్రీనివాస గౌడ కేవలం 9.55 సెకన్లలో పరుగెత్తడం సంచలనంగా మారింది. ఐకళలో తన దున్నలతో కలిసి 142.50 మీటర్ల దూరాన్ని 28 ఏళ్ల శ్రీనివాస గౌడ 13.62 సెకన్లలో పరిగెత్తినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ లెక్కన అతడు వంద మీటర్ల పరుగును కేవలం 9.55 సెకన్లలో పూర్తిచేసినట్లన్నమాట. ప్రస్తుతం 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు బోల్ట్‌ పేరిట ఉంది. 2009లో బెర్లిన్‌లో నిర్వహించిన ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో అతడు 9.58 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తక్కువ కాలంలోనే నూతన వంగడం

నూతన వంగడాలను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు అనువుగా ఇక్రిశాట్‌ సరికొత్త కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘ర్యాపిడ్‌జెన్‌’ పేరిట నెలకొల్పిన ఇది పబ్లిక్‌ రంగంలో ప్రపంచంలోనే అతి పెద్దది కావడం విశేషం. అధునాతన సాంకేతికతను ఉపయోగించి నియంత్రిత వాతావరణంలో తక్కువ సమయంలోనే కొత్త వంగడాలను మార్కెట్లోకి తెచ్చేందుకు ఇది దోహదం చేయనుంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చే విత్తనాలను ఉత్పత్తి చేయడం శాస్త్రవేత్తల ముందున్న సవాల్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పదోన్నతుల్లో రిజర్వేషన్లపై కేంద్రం మల్లగుల్లాలు

పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, వివాదానికి దారితీసే ప్రమాదముందని కేంద్రం పసిగట్టింది. ఆమోదయోగ్య పరిష్కారం కనుగొనడం ద్వారా ఈ వివాదానికి ముగింపు పలకాలని యోచిస్తోంది. ఆ బాధ్యతను న్యాయ, సామాజిక న్యాయశాఖలకు అప్పగించింది. ఉత్తరాఖండ్‌ నీటిపారుదల శాఖకు సంబంధించి సహాయ ఇంజినీర్‌ పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈనెల 7న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రైల్లో రామాయణం

రైల్లో ప్రయాణిస్తున్నా రామాలయంలోనే ఉన్నామన్న భావన కలిగించే ప్రత్యేక రైలు త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. దేశంలోని ప్రముఖ రామాలయాలను కలుపుతూ ఇది ప్రయాణం సాగిస్తుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూలు ఇంకా ఖరారు కాలేదు. అయితే, మార్చి 10 తర్వాత రామాయణ రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ వెల్లడించారు. ‘‘దేశం నలుమూలలకూ ఈ రైలు వెళ్తుంది. బోగీల్లో రామాయణగాథ థీమ్‌ అలంకరణ ఉంటుంది. భజనలు కూడా వినిపిస్తాయి’’ అని ఆయన చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నాపై సినిమా.. భయం లేదు

తన జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకు రాబోతుండడం ఉత్తేజాన్ని కలిగిస్తోందని టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా చెబుతోంది. తన కథను అభిమానుల ముందు ఉంచబోతుండడం ఎలాంటి భయాన్ని కలిగించట్లేదని అంటోంది. గ్రాండ్‌స్లామ్‌ (డబుల్స్‌) గెలవడంతో పాటు మరే భారత టెన్నిస్‌ క్రీడాకారిణికీ సాధ్యం కాని ఎన్నో ఘనతలు సాధించిన సానియా కథను సినిమాగా తీయబోతున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కార్పొరేట్లతో ట్రంప్‌ భేటీ 25న

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనకు వస్తున్న క్రమంలో ఇక్కడి ప్రముఖ కార్పొరేట్లతో ఆయన భేటీ అవుతారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రెండు దేశాల మధ్య మెరుగైన వాణిజ్య-వ్యాపార సంబంధాలు కొనసాగేలా చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. సమావేశంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ ఛైర్మన్‌ ఏఎం నాయక్‌, బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా తదితరులు పాల్గొనే అవకాశాలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కరీనా...నా ప్రతి చిత్రంలోనూ నీతోనే రొమాన్స్‌ చేయాలి

బాలీవుడ్‌ అందాల నాయిక కరీనాకపూర్‌ అంటే ఇష్టపడని వాళ్లు  ఎవరుంటారు? ఆమె బాలీవుడ్‌ అగ్ర కథానాయకులు అందరితోనూ నటించి భారీ విజయాలు అందుకొంది. అందం..అభినయంతో ఏళ్ల తరబడి స్టార్‌ హీరోయిన్‌గా వెలుగుతోంది. తల్లయ్యాకా కూడా ఆమె క్రేజ్‌ తగ్గలేదు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమీర్‌ఖాన్‌ కూడా ఆమె అందానికి మరోసారి ఫిదా అయిపోయారు. ప్రేమికుల రోజు సందర్భంగా కరీనాకు ఓ కానుక ఇచ్చారు. ‘‘నా ప్రతి చిత్రంలోనూ నీతోనే రొమాన్స్‌ చేయాలని ఉంది కరీనా’ అంటూ ట్వీటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.