close

తాజా వార్తలు

Updated : 08/07/2020 09:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. 3 కిలోమీటర్ల నిస్సైనిక ప్రాంతం

తూర్పు లద్దాఖ్‌లో సైనిక ఉద్రిక్తతలు క్రమంగా చల్లారుతున్నాయి. 2 నెలల పాటు తీవ్ర ప్రతిష్టంభనకు కేంద్ర బిందువులుగా ఉన్న హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా ప్రాంతాల నుంచి భారత్‌, చైనాల బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. ఈ ఉపసంహరణను సోమవారం ప్రారంభించిన డ్రాగన్‌.. మంగళవారమూ కొనసాగించింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీల మధ్య చర్చల అనంతరం తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాలూ బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అరుణాచల్‌పై డ్రాగన్‌ కన్ను!

2. చివరి సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టులో!

రాష్ట్రంలో డిగ్రీ, బీటెక్‌, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టులో నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. పరీక్షలు నిర్వహించరాదని దాఖలైన పిల్‌పై ఈ నెల 9న హైకోర్టులో విచారణ సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయనుంది. తాజాగా యూజీసీ సైతం చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని చెప్పినందున అవసరమైన జాగ్రత్తలు తీసుకొని వాటిని నిర్వహిస్తామని చెప్పనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆన్‌లైన్‌ క్లాసులా.. అయితే...మీ దేశం పొండి

అమెరికాలోని విద్యాలయాల్లో ఆన్‌లైన్‌ మాధ్యమంలో వివిధ కోర్సులు అభ్యసించాలనుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులపై పిడుగు పడింది. సెప్టెంబర్‌- డిసెంబర్‌ సెమిస్టర్‌ను ఆన్‌లైన్‌లో చదవాలనుకుంటున్న విద్యార్థులు.. దేశం విడిచి వెళ్లాలని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం.. వేలాది మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎటు పోవాలి..? ఏం చేయాలి..?

పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. వైద్యం కోసం ఎవరిని సంప్రదించాలి.. తక్షణ వైద్యం ఎలా పొందాలి.. ఇప్పుడు హైదరాబాద్‌లో వందలాది మంది కరోనా రోగులను వేధిస్తున్న ప్రశ్న ఇది. పాజిటివ్‌ అని తేలినా కూడా నిర్ధారిత ధ్రువపత్రం సంబంధిత రోగుల సెల్‌ఫోన్‌కు రెండు మూడు రోజుల తరువాత గానీ చేరడం లేదు. ఈ పత్రం లేకపోతే తాము ఆస్పత్రిలో చేర్చుకోలేమని ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఐసోలేషన్‌... అంతా పరేషాన్‌

5. ఆ ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకున్నారు?

కరోనా చికిత్సకు ఛార్జీలను నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ప్రైవేటు ఆస్పత్రులు అపహాస్యం చేస్తున్నాయని  హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. అలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాల్సిందేనంది. ఇలాంటి ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామంది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఒకవేళ చర్యలు చేపట్టని పక్షంలో ఎందుకో చెప్పాలంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. ఎక్స్‌రేతో కరోనా గుర్తింపు!

ఛాతీ ఎక్స్‌రేతో కొవిడ్‌-19ను గుర్తించొచ్చు అంటున్నారు ఐఐటీ గాంధీనగర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కృష్ణ ప్రసాద్‌ మియాపురం.హైదరాబాద్‌కు చెందిన ఈయన నేతృత్వంలో ఐఐటీ పరిశోధకుల బృందం.. కొవిడ్‌ నిర్ధారణకు  ఓ సరికొత్త ప్రయోగాన్ని చేసింది. దీంతో ప్రాథమికంగా కరోనా వైరస్‌ సోకిందా లేదా అన్న విషయంలో ఒక నిర్ధారణకు రావొచ్చు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌) ఆధారంగా ఈ బృందం http:// covidxray.iitgn.ac.in/ అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. మరింత పొడవు మరిన్ని సీట్లు

రవాణా రంగంలో కొత్త విధానాలకు కేంద్రం తెర తీసింది. బస్సుల పొడవు, లారీల ఎత్తు పెంపునకు ఆమోదించింది. దీనివల్ల ఆర్టీసీ బస్సుల్లో సీట్ల సంఖ్య, లారీల్లో సరకు రవాణా సామర్థ్యం పెరగనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు వాహనాల పొడవు, వెడల్పు, ఎత్తుల్లో మార్పులు చేయాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ రెండేళ్లుగా కసరత్తు చేస్తోంది. ఇది ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ మార్పులు పాఠశాల బస్సులకు కూడా వర్తిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. ఎల్‌జీ ఘటనలో 12 మంది అరెస్టు

విశాఖ నగరంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో స్టైరీన్‌ ఆవిరి లీకై 15 మంది మరణించడానికి, పలువురు అస్వస్థులు కావడానికి కారకులయ్యారంటూ 12 మంది ఎల్‌జీ పరిశ్రమ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. మే 7వ తేదీన ఘటన జరగగా, సరిగ్గా రెండు నెలల తర్వాత జులై 7న అరెస్టు చేయడం విశేషం. పోలీసు కమిషనర్‌ ఆర్‌కే మీనా మంగళవారం రాత్రి ఈ విషయం విలేకరులకు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. సుప్రీం రైలు

ఇది సుప్రీం రైలు. పరుగులు పెట్టేటప్పుడు భూకంపాలు వచ్చినా పసిగట్టేస్తుంది. ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి చేరుస్తుంది. నవ్యావిష్కరణలకు చిరునామా అయిన జపాన్‌ ఈ సరికొత్త బుల్లెట్‌ రైలును ఇటీవల పట్టాలపైకి ఎక్కించింది. టొకైడో మార్గంలో తాజాగా దూసుకెళ్లిన ఈ రైలులో చాలా ప్రత్యేకతలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​​​​​​​​

10. విజయోస్తు!

నాలుగు నెలలైంది.. ఆడేవాళ్లు లేరు.. చూసేవాళ్లు లేరు.. మైదానాలు బోసిపోయాయి.. ఆటగాళ్లు ఇళ్లకు పరిమితం అయ్యారు.. క్రీడా ఛానెళ్లన్నీ హైలైట్లతో నడిపించేస్తున్నాయి.. ‘లైవ్‌’ ఊసే లేదు!  ఇక ఇప్పుడిప్పుడే క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారంలో చూసే అవకాశం లేదు అనుకుంటుండగా.. క్రికెట్‌ అభిమానుల కోసం మేమున్నామంటూ ధైర్యంగా ముందుకొచ్చాయి ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్లు. కరోనా మహమ్మారిని ఎదిరించి.. టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమయ్యాయి. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారమే తొలి టెస్టు ఆరంభం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని