
తాజా వార్తలు
నిఘా విభాగానికి చిక్కిన జీఎస్టీ అక్రమార్కులు
అమరావతి: నకిలీ బిల్లులు సృష్టించి రూ.28 కోట్లు జీఎస్టీ రాయితీపొందిన అక్రమార్కులపై ఈనెలలో ఏడు కేసులు నమోదయ్యాయి. గోల్డు బులియన్ మార్కెట్ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించిన రాకెట్ ముఠా గుట్టును విశాఖపట్నం జీఎస్టీ నిఘావిభాగం అధికారులు రట్టు చేశారు. నకిలీ బిల్లులతో రూ.8కోట్లు జీఎస్టీ రాయితీ పొందిన ఈ ముఠాకు చెందిన కీలకమైన వ్యక్తిని జీఎస్టీ నిఘా అధికారులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా గుంటూరు, మంగళగిరి పరిసరాల్లోని వివిధ సంస్థలపై నిర్వహించిన సోదాల్లో రూ.1.58 కోట్ల విలువైన బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. వ్యాపారం చేయకుండానే చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించినట్టు విచారణలో తేలిందని అధికారులు పేర్కొన్నారు. నకిలీ బిల్లులు సృష్టించి రూ.28 కోట్లు జీఎస్టీ రాయితీ పొందిన అక్రమార్కులపై నవంబర్ నెలలో ఏడు కేసులు నమోదు చేసినట్టు వివరించారు. పలు సంస్థలు 32 బోగస్ సంస్థలు ఏర్పాటు చేసి రూ.400 కోట్ల వ్యాపారం చేసినట్టుగా నకిలీ బిల్లులు సృష్టించాయని జీఎస్టీ నిఘా విభాగం అధికారులు వివరించారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- కన్నీటి పర్యంతమైన మోదీ
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
- రెరా మధ్యే మార్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
