
తాజా వార్తలు
త్వరలోనే భారత్‌కు టీకా: గడ్కరీ
ఆర్థిక యుద్ధంలో భారత్ విజయం సాధిస్తుందని ఆశాభావం
దిల్లీ: భారత్‌లో సాధ్యమైనంత త్వరగా టీకా లభ్యమవుతుందని, ఆర్థిక యుద్ధంలో విజయం సాధించేందుకు ఈ దేశం మహమ్మారిని అధిగమిస్తుందని సోమవారం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో మాట్లాడుతూ..చాలా దేశాలు చైనాతో ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధంగా లేవని, భారత్ పట్ల సుముఖంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు.
‘వీలైనంత త్వరగా టీకా వస్తుంది. మనం వంద శాతం కొవిడ్-19కి వ్యతిరేకంగా జరిపే పోరులో విజయం సాధిస్తాం. అలాగే ఆర్థిక యుద్ధంలో కూడా విజయాన్ని సొంతం చేసుకుంటాం. ఇప్పటికే చైనా నుంచి దిగుమతులు తగ్గించుకున్నాం. మన ఎగుమతులు పెరిగాయి. సానుకూల ధోరణి కనిపిస్తోంది’ అని గడ్కరీ అన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మంచి పనితీరు కనబరుస్తున్నాయన్నారు.
మరో సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ..భారత్‌తో సహా ప్రపంచమంతా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని వెల్లడించారు. ‘ప్రజల మనసులో సానుకూలత, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాల్సి ఉంది. అనుమానం, నిరాశావాదం సమస్యలను మరింత జటిలం చేస్తాయి’ అని చెప్పుకొచ్చారు. చైనాతో పోల్చుకుంటే భారత్‌లో యువ ప్రతిభావంతులు ఎక్కువగా ఉన్నారన్నారన్నారు. అలాగే ముడి సరకు అందుబాటులో ఉందని, విధానాలు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
