close

తాజా వార్తలు

Published : 07/11/2020 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

8 ఏళ్లు చాలా ఎక్కువ.. కోహ్లీని తీసేయాలి

అతడికి నేను వ్యతిరేకం కాదు: గౌతమ్‌ గంభీర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: 13వ సీజన్‌లోనూ బెంగళూరు వైఫల్యం చెందడంతో ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని తీసేయాలని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. గతరాత్రి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోహ్లీసేన హైదరాబాద్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో టీ20మెగా క్రికెట్‌ లీగ్‌లో బెంగళూరు మరోసారి విఫలమైంది. ఫైనల్‌ చేరి కప్పు సాధించాలనే కోరిక అలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలోనే ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన గంభీర్‌.. కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించొద్దని చెప్పాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని పేర్కొన్నాడు.

‘ఒక్కసారి కూడా విజయం సాధించకుండా 8 ఏళ్లు కొనసాగడం చాలా ఎక్కువ. రవిచంద్రన్‌ అశ్విన్‌ని చూడండి. పంజాబ్‌కు రెండేళ్లే కెప్టెన్‌గా ఉన్నాడు. ఫలితం లేకపోవడంతో తప్పించారు. మనం ఎలాగైతే రోహిత్‌, ధోనీ గురించి మాట్లాడతామో కోహ్లీ కూడా అంతే. ధోనీ చెన్నైకి మూడు సార్లు, రోహిత్‌ ముంబయికి నాలుగుసార్లు టైటిల్స్‌ అందించారు. అందుకే వారిని ఇన్నేళ్లుగా కొనసాగిస్తున్నారు. ఒకవేళ రోహిత్‌ ఇలాగే ఎనిమిదేళ్లు రాణించకపోయి ఉంటే అతడిని కూడా తొలగించేవారే. ఒక్కొక్కరికీ ఒక్కో లెక్క ఉండకూడదు. ఏ సమస్య ఉన్నా, ఏ బాధ్యత అయినా కెప్టెన్‌ నుంచే మొదలవ్వాలి. అది జట్టు యాజమాన్యం లేదా ఇతర సిబ్బంది నుంచి కాదు. ఒక కెప్టెన్‌గా గెలిచినప్పుడు ఎలాగైతే క్రెడిట్‌ దక్కుతుందో ఓటమిపాలైనప్పుడు కూడా అలాగే విమర్శలు ఎదుర్కోవాలి’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని