close

తాజా వార్తలు

Updated : 09/07/2020 08:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వంటింటి చిట్కాలతో వైరస్‌ దూరం!

పౌష్టికాహారంతో రోగ నిరోధకశక్తి

కరోనా వేళ నిపుణులు సూచనలు

హైదరాబాద్‌: నగరంలో ఎక్కడ చూసినా కరోనా కేసుల తీవ్రత కనిపిస్తోంది. ఇంట్లో ఒకరికి వచ్చినా.. మిగతా కుటుంబ సభ్యులూ వైరస్‌ ముప్పు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి విటమిన్‌ సి, విటమిన్‌ డి3, జింకు తదితర మాత్రలు వాడుతున్నారు. నెలపాటు ఇవి వేసుకోవాలంటే ప్రతి వ్యక్తికి రూ.600-650 వరకు ఖర్చవుతోంది. ఔషధ దుకాణాల్లోనూ మందుల లభ్యత తక్కువైంది! ఈ నేపథ్యంలో వంటింట్లో దొరికే పదార్థాలతోపాటు పౌష్టికాహారంతో వ్యాధి నిరోధకశక్తి పెంపొదించుకోవచ్ఛు కొన్ని జాగ్రత్తలతోపాటు సరైన ఆహారం తీసుకోవాలని పౌష్టికాహార నిపుణులు సుజాత స్టీఫెన్‌ వివరిస్తున్నారు.

ఇలా చేయండి..

ఉదయం లేవగానే నీళ్లలో తులసి, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, బెల్లం, పసుపు కలిపి వేడి చేసుకొని వడబోసుకోవాలి. తేనీటికి బదులు నిత్యం ఒక కప్పు దీనిని తీసుకుంటే.. గొంతులో గరగర, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం దొరుకుతుంది.

 అనంతరం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఈ సమయంలో సూర్యకాంతి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. వేగంగా నడవడం, యోగా వంటివి చేయవచ్ఛు

 అల్పాహారం ఉదయం 8 గంటల లోపు పూర్తి చేయాలి. మినప లేదా రాగి పిండితో చేసిన ఇడ్లీలు తీసుకోవచ్ఛు అందులో క్యారెట్‌, ఆకుకూరలు తురిమి వేసుకోవచ్ఛు మొలకలు తీసుకోవడం ద్వారా సి, ఈ, బి కాంప్లెక్స్‌ విటమిన్లు అందుతాయి. ● 10.30 గంటల సమయంలో ప్రస్తుత సీజన్‌లో దొరికే పండ్లు విరివిగా తీసుకోవాలి. జామ, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, నేరేడు ఎక్కువగా లభ్యమవుతున్నాయి.

 మధ్యాహ్న భోజనంలో రెగ్యులర్‌ పదార్థాలతోపాటు ఏదైనా ఆకుకూరతో కలిపి వండిన పప్పు, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, ముల్లంగి, కాలీఫ్లవర్‌, క్యాబేజీ తదితర కూరలు తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.

 ప్రొటీన్ల కోసం చికెన్‌ ఒక్కొక్కరు 150-200 గ్రాములు, మటన్‌ 75 గ్రాములు, చేపలు 100 గ్రాములు, పన్నీరు 50 గ్రాములు తీసుకోవచ్ఛు వారంలో రెండు మూడు సార్లు తినాలి. శాకాహారులు శనగలు, బొబ్బర్లు, సోయాబీన్స్‌ తీసుకోవాలి.

 సాయంత్రం ఎండు ఫలాలు తీసుకోవాలి. బొబ్బర్లు, అలసందలు, సెనగలు, పుచ్చకాయ, గుమ్మడికాయ గింజలు తీసుకుంటే జింక్‌, సెలీనియం, ఐరన్‌ పుష్కలంగా అందుతాయి. వీటితోపాటు కాయగూరలు ఉడకబెట్టి దానిలో కాస్త మిరియాల పొడి వేసి సూప్‌ కింద తీసుకోవాలి.

 రాత్రి 7.30- 8 గంటలలోపు భోజనం పూర్తిచేయాలి. జొన్న, గోధుమ రొట్టెలు పరిమితంగా తీసుకోవాలి. నిద్రించే ముందు కప్పు పాలల్లో చిటికెడు పసుపు వేసి తీసుకుంటే ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని