విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన.. వీడియోలు వైరల్‌
close

తాజా వార్తలు

Updated : 12/07/2020 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన.. వీడియోలు వైరల్‌

నిజాంపట్నం, న్యూస్‌టుడే: నిజాంపట్నం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇంటర్‌ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి తీసిన వీడియోలు శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావటం స్థానికంగా సంచలనం కలిగించింది. అయితే, కారకుడు ఎక్కడా ఆనవాళ్లు కనిపించకుండా చిత్రీకరించాడు. ఈ ఘటనపై తమకెవరూ ఫిర్యాదు చేయలేదని, వీడియోలు పోస్టయిన వాట్సాప్‌ గ్రూపు అడ్మిన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు రమ్మని చెప్పామని ఎస్సై హరిబాబు తెలిపారు. ఆ వీడియోలు తీసిన వ్యక్తి ప్రైవేట్‌ ఉపాధ్యాయుడని, తన గ్రామంలో అధికార పార్టీ కీలక కార్యకర్తగా వ్యవహరిస్తుంటాడని, గతంలోనూ అతడు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని