close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/04/2020 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏడేళ్ల గరిష్టానికి బంగారం ధర...

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఏడు సంవత్సరాల గరిష్ఠానికి చేరుకుంది. ఈ ఉదయం ఔన్సు బంగారం ధర 1715.25 డాలర్లు పలికింది. ఏడు సంవత్సరాల క్రితం(డిసెంబర్‌ 2012)లో పసిడి ధర 1722.20 డాలర్లుగా నమోదు కాగా.. ఆ తర్వాత పుత్తడికి ఇంత ధరపలకటం ఇదే తొలిసారి.

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తితో అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలనున్నయనే భయాందోళనలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడే సురక్షితమని భావిస్తున్న ఇన్వెస్టర్లు, బులియన్‌ మార్కెట్కు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. ఈ పరిణామాలతో వివిధ దేశాలలో లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ... బంగారం ధర తారస్థాయికి చేరుకుందని పరిశీలకులు తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.