close

తాజా వార్తలు

Published : 22/11/2020 22:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రష్మిక అభిమానులకు శుభవార్త..

హైదరాబాద్‌: దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో  పేరుగాంచిన నటి రష్మిక మందన. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ అవసరమైన వీడియోలను, కొత్త ఫొటోలను నెటిజన్లతో పంచుకుంటారు. ఫ్యాషన్‌ రంగంలో ఆమెను ఎంతో మంది అభిమానిస్తుంటారు. ఫ్యాషన్‌ పట్ల ఎంతో అభిరుచి, అవగాహన కలిగివున్న విషయం తెలిసిందే.

కన్నడ, తెలుగు సినీ రంగంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘ఈ సంవత్సరానికి ‘నేషనల్ క్రష్‌ ఆఫ్‌ ఇండియా’గా రష్మిక మందన ఎంపికైనట్లు గూగుల్‌ ప్రకటించింది. ఇది ఆమె అభిమానులకు సంతోషకరమైన వార్త అని గూగుల్‌ తెలిపింది.

కన్నడలో ‘కిరిక్‌ పార్టీ’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యారు. అలాగే తెలుగులో ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగులు వేశారు. ‘గీతా గోవిందం’ చిత్రంతో అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రష్మిక సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా ‘ఆచార్య’, ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ చిత్రాలలో నటించనున్నారు. 

 




Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని