close

తాజా వార్తలు

Published : 13/07/2020 10:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గూగుల్‌ ఏం తీసుకొస్తొందబ్బా!

దిల్లీ: సినిమా విడుదలకు ముందు టీజర్లు, ట్రైలర్లను విడుదల చేయడం చిత్ర పరిశ్రమకు అలవాటు. ఏదైనా వస్తువును మార్కెట్‌ చేసేందుకు పెద్ద పెద్ద అడ్వర్టైజ్‌మెంట్స్‌ ఇవ్వడం వ్యాపార సంస్థల ఆనవాయితీ. అలాగే ‘గూగుల్’‌ కూడా తన ఉత్పత్తులను విపణిలోకి తీసుకొచ్చేటప్పుడు వినూత్నంగా పబ్లిసిటీ చేస్తుంటుంది. జులై 13న (సోమవారం) కొత్త ప్రొడక్ట్‌ విడుదల చేయనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. దానికి సంబంధించి టీజర్‌ వీడియోను రూపొందించింది. ఇందులో స్టార్‌ కమెడియన్‌ ఫ్రెడ్‌ ఆర్మిసెన్‌ సరదాగా యోగా చేస్తున్నట్లు నాలుగు సెకన్ల నిడివి కలిగిన వీడియోను విడుదల చేసింది. ‘ఈ సోమవారం ఏదో ప్రత్యేకత రాబోతోంది. గట్టిగా శ్వాస తీసుకోండి. సిద్ధంగా ఉండండి’ అంటూ గూగుల్‌ వీడియోకు వ్యాఖ్యను జోడించింది. దీంతో ఏ ప్రొడక్ట్‌ విడుదల చేయబోతున్నదీ అనేదానిపై వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.

ఏమిటా ప్రొడక్ట్?

గూగుల్‌ విడుదల చేయబోయే ఉత్పత్తి ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే మార్కెట్లోకి కొత్త నెస్ట్‌ స్మార్ట్‌ స్పీకర్‌ను లాంచ్ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు స్మార్ట్‌ వాచ్‌కు సంబంధించిన అధికారిక ఫొటో, వీడియోను విడుదల చేసింది. 2016లో గూగుల్‌ నుంచి వచ్చిన హోమ్‌ స్మార్ట్‌ స్పీకర్‌ కంటే ఈ కొత్త ప్రొడక్ట్‌ విజయవంతం కాగలదని సంస్థ భావిస్తోంది. దీనికి యూఎస్‌, జపాన్‌లో రెగ్యులేటరీ అనుమతులను పొందినట్లు తెలిసింది. సోమవారం దీనినే ప్రకటించే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. నెక్ట్స్‌ జనరేషన్‌ హోమ్‌ స్పీకర్‌ ధర దాదాపు 200 డాలర్లు (రూపాయల్లో 15వేలు) ఉండొచ్చు. ఈ స్పీకర్‌కు ‘ప్రిన్స్‌’అని పేరు పెట్టినట్లు సమాచారం.
ఒకవేళ స్పీకర్‌ గురించి గూగుల్‌ ప్రకటించకపోతే.. టెక్‌ నిపుణులు మరోలా ఆలోచిస్తున్నారు. గూగుల్‌ అసిస్టెంట్‌కు కొంత ఉపశమనం కల్పించేలా నూతన ఫీచర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఆరోగ్యానికి సంబంధించి కొత్త హార్డ్‌వేర్‌ ప్రకటనా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. 


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని