
తాజా వార్తలు
ఆర్బీఐ నూతన డిప్యూటీ గవర్నర్ ఎవరంటే!
ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా ప్రముఖ ఆర్థిక వేత్త మైఖేల్ పాత్రా నియమితులయ్యారు. 59 ఏళ్ల మైఖేల్ పాత్రా ప్రస్తుతం ఆర్బీఐ పరిశోధన విభాగంలో ద్రవ్య విధాన కమిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే డిప్యూటీ గవర్నర్గా ఆయనకు ఏ విదమైన బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఆర్బీఐ వర్గాల సమాచారం మేరకు ఆయనకు ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. పాత్రా ఐఐటీ నుంచి ఆర్థిక శాస్తంలో డాక్టరేట్ పొందారు. 2019లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వలో వడ్దీ రేట్లను తగ్గించడంలో మైఖేల్ పాత్రా కీలక పాత్ర పోషించారు. గతంలో డిప్యూటీ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విరాల్ ఆచార్య స్థానంలో కొత్త డిప్యూటీ గవర్నర్గా పాత్రా బాధ్యతలు చేపడతారు.