
తాజా వార్తలు
రెండోసారి కరోనాతో కడప యువ వైద్యుడి మృతి
బద్వేలు: రెండోసారి కరోనా సోకి ఓ ప్రభుత్వ వైద్యుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బద్వేలు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న చిన్న పిల్లల వైద్యుడు నందకుమార్(28)కు మూడు నెలల కిందట కరోనా సోకింది. దీంతో ఆయన గుంటూరులోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. అనంతరం యథావిధిగా విధులకు హాజరయ్యారు. అయితే 15 రోజుల క్రితం జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేయించుకోగా మరోసారి పాజిటివ్ అని తేలింది. దీంతో ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నారు.
అయినా తగ్గకపోవడంతో కడప రిమ్స్‌కు.. వైద్యుల సలహా మేరకు అక్కడ నుంచి తిరుపతి స్విమ్స్‌కు వెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. చిన్న వయసులోనే వైద్య వృత్తిలోకి వచ్చి ఎంతో భవిష్యత్ ఉన్న నందకుమార్‌ను కరోనా పొట్టన పెట్టుకుందని కుటుంబీకులు, తోటి వైద్యులు, సిబ్బంది కన్నీరుమున్నీరవుతున్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
