close

తాజా వార్తలు

Updated : 15/09/2020 15:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పోలవరం బకాయిలు విడుదల చేయండి’

కేంద్రాన్ని కోరిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి

దిల్లీ: పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు వరప్రదాయని అని చెప్పారు. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కావడంతో మొత్తం ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉందన్నారు. అయినప్పటికీ కేంద్ర నిధుల కోసం వేచి చూడకుండా ఇప్పటికే ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.3,805 కోట్లు ఖర్చుచేసిందని విజయసాయి వివరించారు. ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని ధ్రువీకరిస్తూ కాగ్‌ నివేదిక వెల్లడించినట్లు చెప్పారు. కాగ్‌ ఇచ్చిన  నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందన్నారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని విజయసాయిరెడ్డి కోరారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ బకాయిల విడుదలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జలశక్తి మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. త్వరలోనే ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని