జోన్ల వారీగా లాక్‌డౌన్‌ మినహాయింపులివే..
close

తాజా వార్తలు

Published : 02/05/2020 00:32 IST

జోన్ల వారీగా లాక్‌డౌన్‌ మినహాయింపులివే..

దిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు మే 4వ తేదీ నుంచి జోన్ల ఆధారంగా లాక్‌డౌన్‌పై సడలింపులు ఇచ్చింది. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య రాకపోకలు, విమాన, రైళ్ల రాకపోకలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని నిబంధనలను కేంద్రహోంశాఖ నిర్దేశించింది.

మార్గదర్శకాలివే..
> దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలు, సినిమా హాళ్లు, మాల్స్‌, వ్యాయామ శాలలు, క్రీడా ప్రాంగణాలు మూసి ఉంచాలి. ఎటువంటి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనుమతి లేదు. జనాలు ఒకచోట గూమిగూడటంపై నిషేధం కొనసాగనుంది.
> రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లను కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ విభజిస్తుంది. వారానికోసారి అక్కడి పరిస్థితులను బట్టి వాటిని మార్పులు చేర్పులు ఉంటాయి.

> గ్రీన్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి. మద్యం షాపుల వద్ద ఐదుగురికి మించకూడదు. అక్కడ భౌతిక దూరం తప్పకుండా పాటించాలి.
> దేశవ్యాప్తంగా రెడ్‌ జోన్లలోని కంటైన్మెంట్‌ ప్రాంతాలకు వెలుపల నిషేధించిన కార్యకలాపాలతోపాటు బస్సులు, రిక్షాలు, ఆటోలు, క్యాబ్‌ల రాకపోకలపై నిషేధం ఉంటుంది. క్షౌర శాలలు, స్పాలు మూసి ఉంచాలి. రెడ్‌ జోన్లలో అత్యవసర సందర్భాల్లో కార్లలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు, బైక్‌లపై ఒకరుచొప్పున ప్రయాణం చేయొచ్చు.
> పారిశ్రామిక సంస్థలు, సెజ్‌లు, ఎగుమతుల యూనిట్లు, ఇండస్ట్రియల్‌‌ టౌన్‌షిప్‌ల నిర్వహణకు అనుమతి. పట్టణ ప్రాంతాల్లో స్థానిక కూలీలతో భవన నిర్మాణ పనులు చేపట్టవచ్చు. పునరుత్పాదక వనరుల ప్రాజెక్టుల నిర్మాణాలకూ అనుమతి.
> పట్టణ ప్రాంతాల్లో మాల్స్‌, మార్కెట్లు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు అనుమతి లేదు. కాలనీల్లోని చిన్నపాటి కిరాణా దుకాణాలు నిర్వహించవచ్చు.
> రెడ్‌జోన్లలో నిత్యావసరాల సరఫరాకే ఈ-కామర్స్‌ సంస్థలు పనిచేయాలి. 33 శాతం సిబ్బందితో ప్రైవేటు సంస్థలు కొనసాగించవచ్చు. మిగతావారు ఇళ్లనుంచే పనిచేయాలి. 
> అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి. మిగతావారిని అవసరాన్ని బట్టి 33 శాతం వరకు రప్పించాలి.
> రెడ్‌జోన్లలో చాలా వరకు వాణిజ్య, ప్రైవేట్ సంస్థల నిర్వహణకు అనుమతి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, కాల్ సెంటర్లు, శీతల గిడ్డంగులు, ప్రైవేట్ సెక్యూరిటీ, ఇతర స్వయం ఉపాధి రంగాల నిర్వహణకు అనుమతి.

> గ్రీన్‌ జోన్లలో దేశవ్యాప్తంగా నిషేధించిన కార్యకలాపాలు మినహా మిగతావి కొనసాగించవచ్చు. బస్సుల్లో 50 శాతం ప్రయాణికులతో రాకపోకలు సాగించవచ్చు. డిపోల్లోనూ 50 శాతం సిబ్బందికి అనుమతి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని