ట్విటర్‌కు కేంద్రం నోటీసులు!
close

తాజా వార్తలు

Published : 13/11/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్విటర్‌కు కేంద్రం నోటీసులు!

దిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. లేహ్‌ ప్రాంతాన్ని జమ్మూకశ్మీర్‌లో చూపినందుకు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ ఈ నెల 9న  నోటీసులు ఇచ్చింది. లేహ్‌ను కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో చూపడానికి బదులుగా కశ్మీర్‌లో చూపడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలా తప్పుగా ఎందుకు చూపారో ఐదు పని దినాల లోపు వివరణ ఇవ్వాలని గడువు విధించింది. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా, దానికి రాజధానిగా లేహ్‌ను ప్రకటించిన భారత పార్లమెంట్‌ సంకల్పాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా ఈ చర్య ఉందని పేర్కొంటూ ఆ సంస్థ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌కు నోటీసులు పంపింది. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరవపరిచేలా మ్యాప్‌ను చూపినందుకు ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదో ట్విటర్‌, ఆ సంస్థ ప్రతినిధులు సమాధానం చెప్పాలని పేర్కొంది.

ఒకవేళ ఈ నోటీసులపై ట్విటర్‌ స్పందించకపోయినా, సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోయినా ఐటీ చట్టం ప్రకారం దేశంలో ట్విటర్‌ను బ్లాక్‌ చేయడం లేదా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో కూడా లేహ్‌ను చైనాలో భాగంగా చూపడం కూడా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని