close

తాజా వార్తలు

Updated : 26/01/2020 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టూర్లకు వెళ్లండి.. రివార్డు పొందండి

భువనేశ్వర్‌: పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక ఏడాదిలో 15 దేశీయ పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారికి రివార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. పర్యాటకుల పర్యటనలకయ్యే ఖర్చులు భరించడమే గాక, ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ తెలిపారు. 

ఒడిశాలోని కోణార్క్‌లో జరిగిన జాతీయ టూరిజం కాన్ఫరెన్స్‌లో ప్రహ్లాద్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒక ఏడాదిలో దేశంలోని 15 పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు టూరిజం శాఖ పర్యటన ఖర్చులు ఇస్తుంది. అంతేగాక, వారి ఫొటోను మా వెబ్‌సైట్లో ప్రచురిస్తాం’ అని పేర్కొన్నారు. అయితే ఇందుకు ఓ షరతు కూడా విధించింది. పర్యాటకులు తమ సొంత రాష్ట్రంలో మాత్రం విహారయాత్రలకు వెళ్లకూడదు. ఇతర రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలి. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.