close

తాజా వార్తలు

Published : 26/10/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుడ్‌న్యూస్‌: చక్రవడ్డీ మాఫీకి కేంద్రం పచ్చజెండా

మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్థిక శాఖ
మారటోరియం వినియోగించుకోని వారికీ ఊరట

దిల్లీ: పండగ సీజన్‌లో రుణ గ్రహీతలకు ఊరట కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మారటోరియం కాలానికి రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వెలువరించింది. వీలైనంత త్వరగా చక్రవడ్డీ అంశంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేయడం గమనార్హం. వడ్డీ మాఫీ వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.6,500 కోట్ల మేర భారం పడనుంది.

కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. గృహ రుణాలు, విద్య, వాహన, ఎంఎస్‌ఎంఈ, వినియోగ వస్తువుల కొనుగోలు రుణాలు, వినియోగ రుణాలు వంటివి ఈ స్కీమ్‌ పరిధిలోకి వస్తాయి. ఈ రుణం వర్తించాలంటే ఫిబ్రవరి 29 నాటికి సదరు ఖాతా ఎన్‌పీఏగా గుర్తించి ఉండకూడదని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి ఉన్న తేడాను రుణ విక్రేతలు (బ్యాంకులు, ఆర్థిక సంస్థలు) రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం పేర్కొంది.  ఆ మొత్తాన్ని కేంద్రం రీయింబర్స్‌ చేస్తుందని తెలిపింది. మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రకటించిన మారటోరియం కాలానికి ఈ స్కీమ్‌ వర్తిస్తుందని కేంద్రం స్పష్టంచేసింది.  మారటోరియం ఉపయోగించుకోని వారికి కూడా ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. అక్టోబర్‌ 14న ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని, సామాన్యుడి దీపావళి కేంద్రం చేతిలో ఉందంటూ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 2కు వాయిదా వేసింది.




Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని